Wedding viral video: సాధారణంగా ఇటీవల పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. పెళ్లిలో జరిగిన వెరైటీ ఘటనలో ఆ పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. పీటల మీద వరుడుతాగి రావడం, వరుడు డ్యాన్స్ చేస్తు పడిపొవడం, తాగి వేదిక మీదకు రావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
మరికొన్ని చోట్ల వరుడు కట్నం విషయంలో గొడవలు పడటం, బట్టతల బైట పడటం వంటి వాటి వల్ల పీటల మీద పెళ్లిళ్లు పెటాకులు అయిన సంఘటనలు కొకొల్లలు. ఈ క్రమంలో కొన్నిచోట్ల పెళ్లి జరిగేటప్పుడు మాజీప్రియుడు లేదా ప్రియురాలు ఎంట్రీ ఇచ్చి పెళ్లిని ఆపేసిన ఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా,ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వేదిక మీద గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది. అతిథులు, బంధువులు అందరు వచ్చారు. వరుడు, వధువు కూడా.. ఇద్దరు ఒకరి మెడలో మరోకరు దండలు వేసుకుంటున్నారు. యువతి.. వరుడి మెడలో దండ వేసింది. అదేవిధంగా పెళ్లి కొడుకు కూడా.. వధువు మెడలో దండ వేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఒక యువతి అతడ్ని వెనుక నుంచి లాగి పెట్టి ఒక్క తన్ను తన్నింది.
దీంతో అతను బొక్కా బొర్లా పడిపోయాడు. అతడ్ని చూసి అక్కడి వారు షాక్ అయ్యారు. కొంత మంది అతడ్ని లేపీ.. ఏమైందని ఆరా తీయగా.. తనతో ఎఫైర్ నడిపి.. ఇప్పుడు వేరోక పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె చెప్పారంట.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. బాప్ రే.. అంత బలంగా తన్నిందేంటీ భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారంట.