ఊరి బయటే కాపురం..!!

'కరోనా వైరస్'..ఎన్నెన్నో సిత్రాలకు కారణమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఊళ్లోకి ఎవరూ రావొద్దని.. పొలిమేరల్లో గ్రామస్తులు పహారా కాశారు. అంతే కాదు ఏకంగా కట్టెలు, ముళ్లకంపలతో కంచెలు వేశారు. ఊళ్లోకి ఎవరు అడుగు పెట్టాలన్నా.. ముందు అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేశారు. ఊరంతా ఒక్కటై కరోనా మహమ్మారిపై పోరాటం చేశారు.

Last Updated : Apr 12, 2020, 03:33 PM IST
ఊరి బయటే కాపురం..!!

'కరోనా వైరస్'..ఎన్నెన్నో సిత్రాలకు కారణమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఊళ్లోకి ఎవరూ రావొద్దని.. పొలిమేరల్లో గ్రామస్తులు పహారా కాశారు. అంతే కాదు ఏకంగా కట్టెలు, ముళ్లకంపలతో కంచెలు వేశారు. ఊళ్లోకి ఎవరు అడుగు పెట్టాలన్నా.. ముందు అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేశారు. ఊరంతా ఒక్కటై కరోనా మహమ్మారిపై పోరాటం చేశారు. 

కానీ  ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. ఊళ్లో, ఇంట్లో ఉండాల్సిన గ్రామస్తులే.. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా భయంతో.. ఇళ్లు విడిచిపెట్టి .. పొలాల్లోకి కాపురాలు మార్చేస్తున్నారు. పొలాల్లో తాత్కాలికంగా టెంట్లు ఏర్పాటు చేసుకుని అక్కడే కుటంబాలతో సహా నివసిస్తున్నారు. 

ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగింది. తుమకూరు జిల్లా ముద్దెనహళ్లి అనే గ్రామంలో దాదాపు 50 కుటుంబాల వరకు జీవిస్తున్నాయి. ఊళ్లో కరోనా సోకిందనే వార్త వారిని కలవరపెట్టింది. దీంతో ఏకంగా ఊరు ఖాళీ చేసి మకాం పొలాల్లోకి మార్చేశారు. అక్కడ తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబాలతో సహా అక్కడే నివసిస్తున్నారు. 

కరోనా వస్తుందనే భయంతోనే ఇలా ఊరు విడిచి పొలాల్లోకి వచ్చి ఉంటున్నట్లు వారు తెలిపారు. ఐతే వారికి ప్రభుత్వ అధికారులు అవగాహన కల్పించారు. తహశీల్దార్ సలహా మేరకు పొలాల్లోకి తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News