పీఏకి కరోనా.. హోమ్ క్వారంటైన్‌లోకి మంత్రి హరీష్ రావు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావు సిబ్బందిలో కరోనా కలకలం రేపింది. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు హోమ్ క్వారంటైన్‌కి వెళ్లారు.

Last Updated : Jun 13, 2020, 11:22 AM IST
పీఏకి కరోనా.. హోమ్ క్వారంటైన్‌లోకి మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు (Harish Rao) హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలోని ఓ వ్యక్తిగత సహాయకుడికి కోవిడ్19 (COVID-19) పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో మొత్తం 51 మంది హరీష్ రావు సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

అందులో శుక్రవారం వచ్చిన కోవిడ్19 టెస్టుల ఫలితాలలో మంత్రి, సహా 17 మందికి నెగటివ్‌గా తేలింది. మిగతావారి ఫలితాలు రావాల్సి ఉంది. మంత్రి హరీష్ సహా, ఇతర సిబ్బంది అంతా హోం క్వారంటైన్‌కు వెళ్లారు. భౌతిక దూరం పాటిస్తున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News