Indian Railway: ఆ స్టేషన్లలో ఇక రైళ్లు ఆగవు

భారతీయ రైల్వే ( Indian Railway)  కీలకమార్పులు చేస్తోంది. జీరో బేస్డ్ టైమ్ టేబుల్ (zero based time table) వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం ఇకపై ఆ రైల్వే స్టేషన్లలో హాల్ట్ ( Railway station halts) లకు ఇండియన్ రైల్వే స్వస్తి పలకనుంది. ఈ మార్పుతో దూర ప్రాంత ప్రయాణాల్లో గణనీయంగా సమయం తగ్గనుంది. 

Last Updated : Jul 5, 2020, 06:36 PM IST
Indian Railway: ఆ స్టేషన్లలో ఇక రైళ్లు ఆగవు

భారతీయ రైల్వే ( Indian Railway)  కీలకమార్పులు చేస్తోంది. జీరో బేస్డ్ టైమ్ టేబుల్ (zero based time table) వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం ఇకపై ఆ రైల్వే స్టేషన్లలో హాల్ట్ ( Railway station halts) లకు ఇండియన్ రైల్వే స్వస్తి పలకనుంది. ఈ మార్పుతో దూర ప్రాంత ప్రయాణాల్లో గణనీయంగా సమయం తగ్గనుంది. 

జీరో బేస్డ్ టైమ్ టేబుల్. ఇదీ ఇప్పుడు ఇండియన్ రైల్వే ( Indian Railways)  చేపట్టబోతున్న భారీ మార్పు. దీని ప్రకారం రైల్వే సమయాల్లో గణనీయంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాస్తవానికి ఈ వ్యవస్థను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా సరే...కరోనా వైరస్ ( Corona virus)  కారణంగా వాయిదా పడిందని..త్వరలో ప్రారంభిస్తామని రైల్వే బోర్డు ఛైర్మన్( Railway board) వీకే యాదవ్ స్పష్టం చేశారు. భారతీయ రైల్వే టైమ్ టేబుల్ ( Railway time table )  ను సమూలంగా మార్చడానికి రైల్వే శాఖ ( Railway department ) సిద్ధమవుతోంది. ఇకపై ప్రయాణీకుల సంఖ్యను బట్టి..హాల్ట్ ల నిర్ణయమనేది ఉంటుంది. దీని ప్రకారం చాలా స్టేషన్లలో ముఖ్యంగా ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉండే స్టేషన్లలో  రైళ్లు అగవు. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది.మరీ ముఖ్యంగా దూర ప్రయాణాల్లో సమయం తగ్గనుంది. ఫలితంగా కొన్ని పాసెంజర్ రైళ్లు సైతం ఎక్స్ ప్రెస్ లుగా మారనున్నాయి. జీరో బేస్ట్ టైమ్ టేబుల్ ప్రకారం అన్ని రైళ్ల షెడ్యూల్, ఫ్రీక్వెన్సీ ఒకేసారి నిర్ధారితం కానున్నాయి. Also read: IRCTC Rajdhani Express: Timing: రాజధాని రైళ్ల టైమింగ్‌లో మార్పు..కొత్త టైమ్ టేబుల్ ఇదే 

గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలో ఉన్న హాల్ట్ ల కారణంగా సమయం ఎక్కువవుతోంది. ఈ హాల్ట్ ల సంఖ్యను తగ్గిస్తే ప్రయాణ సమయం ఆదా అవుతుంది. కొన్ని రైల్వే స్టేషన్లలో ఎక్కేవారి సంఖ్య, దిగేవారి సంఖ్య ఆధారంగా సమీక్షించి ఆయా హాల్ట్ లను తగ్గించనున్నారు. ఎందుకంటే చాలా రైళ్ల  హాల్ట్ లను రాజకీయ నిర్ణయాల ఆధారంగా నిర్ధారించారన్నది రైల్వే బోర్డు చెబుతున్న మాట. దూర ప్రయాణం ( long distance trains) సాగించే రైళ్ల హాల్ట్ లను తగ్గించడం ద్వారా సమయాన్ని ఆదా చేయవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. ఎప్పుడైతే హాల్ట్ లను తగ్గించగలుగుతామో..ఆ రైళ్లు నాన్ స్టాప్ గా ఎక్కువదూరం వెళ్లడానికి ఆస్కారముంటుందని రైల్వే శాఖ  యోచిస్తోంది. మరోవైపు ప్రైవేట్ రంగంలో నడపనున్న 151 రైళ్లు ( 151 private trains)  కూడా జీరో బేస్డ్ టైమ్ టేబుల్  వ్యవస్థలో బాగంగా ఉంటాయని రైల్వే శాఖ చెబుతోంది. Also read: Delhi: ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం 

ఈ కొత్త వ్యవస్థ అమల్లో వస్తే...కచ్చితంగా రైళ్ల ప్రయాణ సమయం తగ్గనుంది. దాంతోపాటు ప్రయాణీకుల రద్దీ లేని స్టేషన్లలో ఇకపై  హాల్ట్ లు ఉండవు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here. 

Trending News