ఫ్యాక్టరీలో భారీ పేలుడు (Explosion At a Factory) సంభవించిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా (Ghaziabad Factory Explosion)లో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోదీనగర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఓ కర్మాగారంలో పేలుడు సంభవించింది. జనావాసాల మధ్య నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించి, మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. బిల్లు గురించి ప్రశ్నిస్తే మహిళా డాక్టర్ నిర్బంధం
ఫ్యాక్టరీలో రాజుకున్న నిప్పురవ్వ నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలకు అంటుకోవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో (జులై 5న మధ్యాహ్నం) ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు చనిపోగా, మరో నలుగురు కార్మికులకు కాలిన గాయాలైనట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. బాధ్యత ఉండక్కర్లేదా?
ఘటనాస్థలానికి సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ప్రమాదానికి సంబంధించి దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!
ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు కార్మికుల దుర్మరణం