బీజేపీని ఓడించేందుకు ఓడించేందుకు అన్ని బీజేపీ వ్యతిరేకశక్తులన్నింటినీ ఏకం చేసినప్పటికీ రాహుల్ గాంధీ సక్సెస్ కాలేకపోయారు. కమలం పార్టీని ఓడించేందుకు బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హార్ధిక్‌పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలతో రాహుల్‌గాంధీ చేతులు కలిపారు.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ సారథి. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమబాట పట్టిన హార్ధిక్ పటేల్, వారికి రిజర్వేషన్లు వ్యతిరేకించిన ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్లు కాంగ్రెస్‌కు మద్దతునివ్వడం విశేషం. ఠాకూర్ మరో ముందడుగు వేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని రదాన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఉనాలో దళితులపై దాడులకు నిరసనగా దళిత న్యాయవాది జిగ్నేష్ మెవానీ ఉద్యమించారు.
భాజపా వ్యతిరేకతే అజెండాగా వీరు నలుగురు చేతులు కలిపి ప్రచారం నిర్వహించారు. భాజపా వ్యతిరేకతే అజెండాగా వీరు నలుగురు చేతులు కలిపి ప్రచారం నిర్వహించారు. అయితే నలుగురు నేతలు వేర్వేరు సిద్ధాంతాలకు ప్రతినిధులుగా చెప్పుకొని ఒకటిగా చేరడం ఓటర్లపై అంతగా ప్రభావం చూపించలేదు. కేవలం అధికారం కోసమే ఈ కూటమి అన్నట్టుగా భాజపా ప్రచారం చేయడంలో సక్సెస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.