/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( అక్టోబరు 13 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,446 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,16,238 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,241 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ

రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 1,91,269 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 23,728 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 88.45 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం 40,056 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 13వ తేదీ వరకు రాష్ట్రంలో 36,64,152 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. Also Read : Kavitha: క్వారంటైన్‌లోకి ఎమ్మెల్సీ కవిత

ఇదిలాఉంటే.. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 252 కరోనా కేసులు నమోదు కాగా..  రంగారెడ్డి జిల్లాలో 135, నల్లగొండ జిల్లాలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 131 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

Section: 
English Title: 
Coronavirus positive cases in telangana state stands at 2,16,238 and 1,241 deaths
News Source: 
Home Title: 

Telangana Covid-19: తాజాగా 1,446 కరోనా కేసులు

Telangana Covid-19: తాజాగా 1,446 కరోనా కేసులు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Telangana Covid-19: తాజాగా 1,446 కరోనా కేసులు
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 14, 2020 - 09:55