హైదరాబాద్: భారీ వర్షాలు భాగ్యనగర వాసులను అభాగ్యులుగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది ఇళ్లు నీటమునిగాయి. కొన్ని వీధులు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నేడు సైతం మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పడవలో వెళ్లి బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతానికి చేరుస్తున్నారు. ఇదంతా గమనిస్తే మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా అనే భావన నగరవాసులలో కలుగుతోంది. ఈ నేపథ్యంలో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. Also Read : Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు..
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు. కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.67 మీటర్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకున్నాక సైతం ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లోకి 1,560 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు పూర్తిస్థాయికి నీటి మట్టం చేరడంతో తూముల ద్వారా 2,098 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
పూర్తిగా నిండిన హుస్సేన్ సాగర్.. భారీగా నీటి విడుదల
భారీ వర్షాలు భాగ్యనగర వాసులను అభాగ్యులుగా మార్చేస్తున్నాయి
వేలాది ఇళ్లు నీటమునిగాయి. కొన్ని వీధులు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి
నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది