'పవన్ కల్యాణ్ పాలిటిక్స్' పై స్పందించిన మంత్రి కేటీఆర్

ట్విటర్‌లో నెటిజెన్స్ అడిగిన అనేక ప్రశ్నలకి ఎంతో ఓపిగ్గా సమాధానం ఇవ్వడమేకాకుండా అవసరాన్నిబట్టి కొందరికి కొన్ని ఫన్నీ కౌంటర్లు కూడా ఇచ్చారు.

Last Updated : Dec 30, 2017, 10:32 AM IST
'పవన్ కల్యాణ్ పాలిటిక్స్' పై స్పందించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్ ద్వారా నెటిజెన్స్ అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. ట్విటర్‌లో నెటిజెన్స్ అడిగిన అనేక ప్రశ్నలకి ఎంతో ఓపిగ్గా సమాధానం ఇవ్వడమేకాకుండా అవసరాన్నిబట్టి కొందరికి కొన్ని ఫన్నీ కౌంటర్లు కూడా ఇచ్చారు. " కేటీఆర్ గారు.. మీ లాంటి ప్రజా నేత కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలి" అని ఓ నెటిజెన్ అడిగిన కోరికకు స్పందించిన కేటీఆర్.. తాను తన రాష్ట్రానికి చేయాల్సింది ఇంకెంతో వుందని చెబుతూనే.. తనకి ఇలా వుండటమే సంతోషంగా వుందని బదులిచ్చారు. 

 

కేటీఆర్ గారూ.. మీకు కాలేజీ రోజుల్లో గాళ్‌ఫ్రెండ్స్ వున్నారా అని మరో నెటిజెన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. ఇప్పుడు తాను వాళ్ల పేర్లు చెప్పాలా ఏంటి ? అంటూ అంతే సరదాగా సమాధానం ఇచ్చారు.

 

సీఎం కేసీఆర్ రియల్ స్టోరీ ఆధారంగా ఎవరైనా దర్శకుడు బయోపిక్ తెరకెక్కించడానికి ముందుకొస్తే, అందుకు సీఎం కేసీఆర్ గారు ఓకే చెబుతారా అని మరో నెటిజెన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తనదైన స్టైల్లోనే జవాబిచ్చారు. అలా కేటీఆర్‌కి నెటిజెన్స్‌కి మధ్య కనిపించిన పలు ఆసక్తికరమైన ట్వీట్స్‌పై ఓ లుక్కేద్దాం.

 

<

Trending News