Coronavirus Recovery Rate India | భారత దేశంలో కోవిడ్-19 ( Covid-19 ) నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనావైరస్ రోగుల్లో రికవరీ రేటు 90.62 శాతానికి పెరిగింది అని పేర్కొంది. గడచిన 24 గంటల్లో 63,000 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 72 లక్షలకు చేరుకుంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read | TTD Special Darshan: రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన తితిదే
తాజా గణాంకాల ప్రకారం భారత్ దేశంలో ప్రస్తుతం 6,25,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 1,19,502 మంది కోవిడ్ -19 వైరస్ సోకి మరణించారు. వైరస్ బారీ నుంచి కోలుకుని 72,01,070 మంది ఆరోగ్యవంతులుగా మారారు.
ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 4 కోట్ల 34 లక్షల 83 వేల 973 (4,34,83,973 ) మం,దికి కరోనావైరస్ ( Coronavirus ) సోకింది. ఇందులో 11 లక్షల 58 వేల 883 మంది ( 11,58,883 ) మరణించారు.
Also Read | AUEET-AUCET 2020: ఆంధ్ర యూనివర్సిటీ పీజీ కోర్సుల అడ్మిషన్స్ వివరాలు
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
COVID-19 Recovery Rate: ఇండియాలో 90.62 శాతానికి రికవరీ రేటు