సరయూ నది తీరాన ( Saryu River Bank )...రాముడి జన్మస్థలంలో రాముడి చరితను వింటే..అంతకంటే భాగ్యం మరొటకి ఉండదనేది ఓ విశ్వాసం. దీపావళి పురస్కరించుకుని అయోధ్యలో అదే జరుగుతోంది. ఓ అనిర్వచనీయమైన అనుభూతి మిగుల్చుతోంది.
దీపావళి ( Diwali ) పురస్కరించుకుని అయోధ్య( Ayodhya ) అందంగా ముస్తాబైంది. రాముడి జన్మస్థలం కావడమే ఓ విశేషమైతే..దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న వివాదాస్పద రామ జన్మభూమి ( Ram janmabhoomi ) అంశానికి తెరపడి..ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి భవ్యమందిరాన్ని భూమి పూజ కూడా జరగడం మరో ప్రాధాన్యత. రామజన్మభూమి వివాదానికి తెరపడి..శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణ ( Ram temple construction ) భూమిపూజ జరిగిన తరువాత ఇది తొలి దీపావళి కావడంతో మరింతగా ప్రత్యేకత సంతరించుకుంది. ఏకంగా 5 లక్షల 51 వేల దీపాలతో అయోధ్యను సుందరంగా అలంకరించారు.
మరోవైపు సరయూ నది తీరాన అయోధ్యలో శ్రీరాముడి చరిత్రను..ప్రాధాన్యతను బ్యాక్ గ్రౌండ్ లో వివరిస్తూ సాగిన లేజర్ షో ( Laser Show ) అత్యద్భుతంగా సాగింది. కాస్సేపు శ్రీరాముడి నాటి అయోధ్యలో ఉన్నట్టుగా అనుభూతి కలిగింది. రాముడి చరిత్రను కళ్లకు కట్టినట్టుగా లేజర్ షో సాగింది. దేశవ్యాప్తంగా అయోధ్యకు చేరుకున్న భక్తులకు ఈ లేజర్ షో ..ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చింది.
#WATCH: Laser show underway on the banks of river Saryu in #Ayodhya as part of 'Deepotsava' celebrations. #Diwali pic.twitter.com/VQqbNHtEht
— ANI UP (@ANINewsUP) November 13, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Also read: Ayodhya: 5 లక్షల 51 వేల దీపాలతో వైభవోపేతంగా అయోధ్యలో తొలి దీపావళి
Laser show: రాముడి చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించిన లేజర్ షో
సరయూ నది తీరాన అయోధ్యలో రాముడి చరిత్రను తెలిపే లేజర్ షో
దీపావళి పురస్కరించుకుని 5.51 లక్షల దీపాలతో అలంకరణ
రామ జన్మభూమి అంశం పరిష్కారం తరువాత అయోధ్యలో తొలి దీపావళి