BJP president Nadda's convoy pelted with stones: కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ( West Bengal ) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ( BJP ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) రెండు రోజుల బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. జేపీ నడ్డా కాన్వాయ్‌పై గురువారం ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కైలాష్ విజయవర్గీయ (Kailash Vijayvargiya) వాహనం పూర్తిగా దెబ్బతింది.
I have been injured in this attack. The party president's car was also attacked. We strongly condemn it. In the presence of police, goons attacked us. It felt as if we were not in our own country: BJP leader Kailash Vijayvargiya at South 24 Paraganas https://t.co/H6FFf2G8WD pic.twitter.com/KSVIhDzUN8
— ANI (@ANI) December 10, 2020
గురువారం కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న క్రమంలో జేపీ నడ్డా కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో నడ్డా ప్రయాణిస్తున్న వాహనం ముందుకు వెళ్లగా.. విజయ వర్గీయ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. తమ కాన్వాయ్‌పై రాళ్ల దాడికి సంబంధించిన ఫొటోలను విజయవర్గీయ (Vijayvargiya) సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ దాడి తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలే చేశారని... ప్రణాళికతో తమపై దాడికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) ఆరోపించారు. Also read: Narendra Modi: కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన
This is a black day in the history of Indian politics. Even the media is not safe in West Bengal: Dilip Ghosh, State BJP President on the attack on BJP President's convoy at Diamond Harbour#WestBengal pic.twitter.com/fyoXOKijm0
— ANI (@ANI) December 10, 2020
తృణమూల్ కార్యకర్తలు నల్లజెండాలతో తమ కాన్వాయ్‌ను ఆపడానికి ప్రయత్నించారని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఆపకపోవడంతో రాళ్లదాడికి పాల్పడ్డారని తెలిపారు. జీపీ నడ్డా పర్యటనలో భద్రత లోపం గురించి బుధవారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు. అయితే జేపీ నడ్డా పర్యటనలో భద్రత లోపంపై హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ ప్రభుత్వానికి వివరణ కోరింది. Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe