Mega Power Star: మెగాఫ్యామిలీ అభిమానులకు రామ్ చరణ్ షాకించ్చారు. తనకు కరోనావైరస్ సోకినట్టు తెలిపారు రామ్ చరణ్. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టిన రామ్ చరణ్.. తనను ఇటీవల కాలంలో కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలి అని కోరారు.
ALSO READ| Quarentine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
తన ఆరోగ్యం, రికవరీ గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తాను అని ట్వీట్ చేసి తెలిపారు చెర్రీ (Ram Charan). తనకు ఎలాంటి లక్షణాలు లేవు అని.. ప్రస్తుతం హోం క్వారెంటైన్లో ఉన్నట్టు తెలిపాడు.
Request all that have been around me in the past couple of days to get tested.
More updates on my recovery soon. pic.twitter.com/lkZ86Z8lTF— Ram Charan (@AlwaysRamCharan) December 29, 2020
కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా కోవిడ్-19 వైరస్ సోకినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే అభిమానులు కలవరపడ్డారు.
ALSO READ| Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
ఈ పోస్ట్ పెట్టిన మూడు రోజుల తరువాత మెగాస్టార్ఖ చిరంజీవి మరో ట్వీట్ చేశారు. అందులో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల తన టెస్టు ఫలితాలు వేరుగా వచ్చినట్టు... తనకు కోవిడ్-19 సోకలేదు అని వివరించారు.
A group of doctors did three different tests and concluded that I am Covid negative & that the earlier result was due to a faulty RT PCR kit. My heartfelt thanks for the concern, love shown by all of you during this time. Humbled ! 🙏❤️ pic.twitter.com/v8dwFvzznw
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 12, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
This Story is Developing..kindly Refresh the page