Shakuntalam movie: భారీ విఎఫ్ఎక్స్‌తో సమంత శాకుంతలం

ఒక్కడు, సైనికుడు, వరుడు, రుద్రమదేవి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ లాక్‌డౌన్ సమయంలో 'శాకుంతలం' అనే చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Jan 9, 2021, 02:09 AM IST
Shakuntalam movie: భారీ విఎఫ్ఎక్స్‌తో సమంత శాకుంతలం

ఒక్కడు, సైనికుడు, వరుడు, రుద్రమదేవి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ లాక్‌డౌన్ సమయంలో 'శాకుంతలం' అనే చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ రొమాంటిక డ్రామాలో శకుంతలగా సమంత ( Samantha as Shakuntala ) ఖరారైనట్టు జనవరి 1న గుణశేఖర్ ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో ఈ చిత్ర బృందం బిజీగా ఉంది. మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి సెట్ పని కొనసాగుతోంది.

శాకుంతలం సినిమా కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ ( VFX work) కూడా కీలక పాత్ర పోషించనుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం కొన్ని ఇంటర్నేషనల్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Also read : Niharika Konidela: పెళ్లి తర్వాత నిహారిక కొత్త ప్రయత్నం

శాకుంతలం సినిమా ( Shakuntalam movie ) షూటింగ్ చాలా వరకు గ్రీన్ మ్యాట్‌పైనే జరుగనుంది అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి నటీనటులు ఎంపిక దాదాపు పూర్తయింది. త్వరలో శాకుంతలం సినిమాలోని ఇతర నటీనటులు పేర్లు వెల్లడించనున్నారు అని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News