Chiranjeevi to join Janasena ? : చిరంజీవి జనసేన పార్టీలో చేరనున్నారా ?

Chiranjeevi to join Pawan Kalyan's Janasena party ? మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తిరిగి వస్తున్నారా ? తాను రాజకీయాల నుండి తప్పుకున్నానని చిరంజీవి పేర్కొన్న చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా ? తాజాగా జనసేన పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి మీడియాతో ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలే ఈ సందేహాలకు తావిచ్చాయి.

Last Updated : Jan 27, 2021, 07:59 PM IST
Chiranjeevi to join Janasena ? : చిరంజీవి జనసేన పార్టీలో చేరనున్నారా ?

Chiranjeevi to join Pawan Kalyan's Janasena party ? మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తిరిగి వస్తున్నారా ? తాను రాజకీయాల నుండి తప్పుకున్నానని చిరంజీవి పేర్కొన్న చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా ? తాజాగా జనసేన పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి మీడియాతో ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలే ఈ సందేహాలకు తావిచ్చాయి. చిరంజీవి త్వరలోనే తన సోదరుడు పవన్ కళ్యాణ్‌తో ( Pawan Kalyan ) కలిసి పని చేస్తారని బుధవారం నాదేండ్ల మనోహర్ ( Nadendla Manohar ) మీడియాకు తెలియజేశారు. దీంతో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా రాజకీయవర్గాల్లోనూ చర్చనియాంశమయ్యాయి.

చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన Janasena Party లో చేరతారా లేదా బయటి నుంచే నైతికంగా మద్దతు ఇస్తారా అనే విషయంలో నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇవ్వలేదు. జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం కోసం చిరంజీవి రావచ్చనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలెంత అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇవేవీ కాకపోతే.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మెగా అభిమానుల మద్దతును కూడగట్టుకోవడంతో పాటు కాపు ఓటు బ్యాంకును ( Kapu community votes ) సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Also read : Krack movie తర్వాత భారీగా Remuneration పెంచిన Raviteja

2008లో ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి.. ఆ ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని ( Prajarajyam party ) కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి పీఎం మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 

ఖైదీ నెం 150 మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సైరా నరసింహ రెడ్డి సినిమాతో మరోసారి తన ప్రభంజనాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ షూటింగ్‌తో ( Acharya movie ) బిజీగా ఉన్న చిరంజీవి.. మార్చిలో లూసిఫర్‌ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ను ( Lucifer Telugu remake ) కూడా ప్రారంభిస్తారు. బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో రెండు చిత్రాలకు మెగాస్టార్ సైన్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News