COVID-19 Positive Cases: తెలంగాణలో నిన్న ఒక్కరోజే 887 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Telangana New COVID-19 Positive Cases: ఒకరోజు తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు క్రమక్రమంగా భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 887 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,776కు చేరింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 1, 2021, 11:05 AM IST
  • తెలంగాణలో తాజాగా 887 మంది కరోనా బారిన పడ్డారు
  • రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,776కు చేరింది
  • గురువారం ఉదయం ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది
COVID-19 Positive Cases: తెలంగాణలో నిన్న ఒక్కరోజే 887 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

COVID-19 Positive Cases: తెలంగాణలో కోవిడ్19 పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. ఈ వారంలో ఒకరోజు తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు క్రమక్రమంగా భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 887 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,776కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 59,297 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 887 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 8 వేల 7 వందల డెబ్బైకి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో నలుగురు వ్యక్తులు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,701కి చేరింది.

Also Read: Penalty on no mask: మాస్క్ లేకుండా రోడ్డుపై వస్తే..భారీ జరిమానా తప్పదిక

గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది. బుధవారం ఒక్కరోజు 337 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,01,564 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికం అవుతుంది.  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC)లోనే ఏకంగా 201 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా(CoronaVIrus) సెకండ్ సేవ్ కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 2,166 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read: SBI Alert: ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్, నేడు ఈ సేవలకు అంతరాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News