Tamilnadu Assembly Elections 2021: తమిళనాట చిన్నమ్మకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అభిమానుల్ని నిరాశకు గురి చేసిన ఆమెకు ఓటు వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
అవినీతి ఆరోపణలు, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం జైలు నుంచి విడుదలైన తమిళనాట చిన్నమ్మ అలియాస్ శశికళ (Sasikala) రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తారనే అందరూ ఊహించారు. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ రాజకీయాలకే స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆమెకు ఓటు వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. శశికళ పేరు ఓటర్ల జాబితా ( Sasikala name missing in voters list) లో కన్పించకపోవడం తమిళనాట చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఇప్పుడు తమిళనాడులో ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజకీయాల్నించి తప్పించారు సరే..ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామి ( Palani swamy) నే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే కుట్ర చేసిందని మండిపడ్డాడు.
Also read: Supreme court: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ నియామకం ఖరారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Tamilnadu Assembly Elections 2021: శశికళకు మరో షాక్..ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు