టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. సక్సెస్ఫుల్ ఫార్ములాతో ముందుకు సాగుతున్న దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ మరోసారి జత కట్టిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు వివాహం అనంతరం కాజల్ అగర్వాల్ షూటింగ్లో రెగ్యూలర్‌గా పాల్గొంటోంది.
ఉగాది పండుగ సందర్భంగా ఆచార్య మూవీ నుంచి సిద్ధకు జోడీగా నటిస్తున్న భామను పరిచయం చేశారు. స్టూడెంట్ లీడర్‌గా, ఆపై నక్సలైట్‌గా మారిపోయిన రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. వచ్చే నెలలో విడుదల కానున్న ఆచార్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సిద్ధ పాత్ర పోస్టర్‌ను రివీల్ చేశారు. ఆ పోస్టర్లో చిరంజీవితో పాటు రామ్ చరణ్(Ram Charan) చేతిలో తుపాకులున్నాయి. తాజాగా ఉగాది కానుకగా సిద్ధ లవర్ నీలాంబరి ‘పూజా హెగ్డే’ను పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్.
Also Read; Ram Charan Birthday Gift: ఆచార్యకు తోడైన సిద్ధ.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్
Introducing #Siddha's Love #Neelambari !
Wishing you all a very Happy Ugadi.#Acharya@KChiruTweets @sivakoratala @hegdepooja @MsKajalAggarwal #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/MLkHsMKFMG— Ram Charan (@AlwaysRamCharan) April 13, 2021
తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి పరసర అటవీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ షూడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది. తండ్రితో కలిసి గత సినిమాల్లో కేవలం సీన్లు, పాటకు మాత్రమే పరిమితమైన చెర్రీ తాజాగా ఆచార్య మూవీలో అరగంటకు పైగా నిడివి ఉన్న పాత్రలో కనిపించి మెప్పించనున్నాడని తెలుస్తోంది. చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్ తెరపై అంతసేపు కనిపిస్తే మెగా అభిమనులు, టాలీవుడ్ ప్రేక్షకులకు పండగే. సక్సెస్ఫుల్ మూవీలలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న పూజా హెగ్డే తాజాగా ఆచార్య లాంటి భారీ ప్రాజెక్టులో భాగస్వామి అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook