Rahul Gandhi COVID-19 Positive : కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో దేశంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మహమ్మారి బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్-19 మరణాలు దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సమాచారం.
తనకు కరోనా పాజిటివ్ అని స్వయంగా రాహుల్ గాందీ తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారని రాహుల్ గాంధీ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను నేరుగా కలుసుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు చేయించుకోవాలని సూచించారు. నిన్న మాజీ ప్రధాని మన్మోసింగ్ సైతం కరోనా బారిన పడ్డారు. మరుసటిరోజే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి కోవిడ్19 పాజిటివ్ వార్త బయటకు రావడంతో కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: Corona Cases: భారత్‌కు ప్రయాణాలు చేయవద్దని పౌరులను హెచ్చరించిన అమెరికా ప్రభుత్వం
After experiencing mild symptoms, I’ve just tested positive for COVID.
All those who’ve been in contact with me recently, please follow all safety protocols and stay safe.
— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2021
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ సేవ్ మొదలైన సమయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోవిడ్19(COVID-19) విషయంపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. వలస కార్మికులు, కూలీలకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సైతం రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే వలస కార్మికులు రోడ్డున పడుతున్నారని, వారి సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు
కాగా, కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాను పబ్లిక్ ర్యాలీలు, సమావేశాలలో పాల్గొనటం లేదని, కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ఆదివారం ప్రకటించడం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ప్రచారం చేయాల్సి ఉండగా తన ర్యాలీలను రద్దు చేసుకున్నానని ఇటీవల తన ట్విట్టర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఈ క్రమంలో కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 టెస్టులకు వెళ్లారు. ఆ ఫలితాలలో రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్‌కు వెళ్లారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook