COVID-19 Vaccine: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ గురువారం నాడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)తో బిజీగా ఉన్న శిఖర్ ధావన్ తాజాగా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు 35 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ధన్యవాదాలు తెలిపాడు.
టీమిండియాకు ఓపెనర్‌గా టెస్టులు, వన్డేలు, టీ20లలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన క్రికెటర్ శిఖర్ ధావన్. ఐపీఎల్ (IPL 2021)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా షాతో కలిసి జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. బయో బబుల్ వాతావరణంలో ఉన్నప్పటికీ ఐపీఎల్ ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, మైదాన సిబ్బంది కరోనా బారిన పడటంతో ఐపీఎల్ 14వ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే. మరోవైపు ఐపీఎల్ కొనసాగితే కేంద్రం అనుమతితో మే తొలివారంలోనే భారత ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లకు కోవిడ్19 వ్యాక్సిన్ ఇవ్వడానికి బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Also Read: Sourav Ganguly: తొలిసారిగా ఐపీఎల్ మధ్యలోనే నిలిచిపోవడంపై స్పందించిన BCCI President సౌరవ్ గంగూలీ
Vaccinated ✅ Can’t thank all our frontline warriors enough for their sacrifices and dedication. Please do not hesitate and get yourself vaccinated as soon as possible. It’ll help us all defeat this virus. pic.twitter.com/0bqBnsaWRh
— Shikhar Dhawan (@SDhawan25) May 6, 2021
కాగా, ఐపీఎల్‌లో భాగమైన ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా సోకడంతో ఐపీఎల్ 2021ను మధ్యలోనే నిలిచిపోయింది. ఐపీఎల్ నిలిచిపోవడంతో ఇంటికి వెళ్లిపోయిన శిఖర్ ధావన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనాపై పోరాటంలో భాగమైన ఫ్రంట్‌లైన్ వారియర్లకు ధన్యవాదాలు తెలిపాడు. కరోనా వైరస్‌ను తరిమేయాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని నెటిజన్లకు సూచిస్తూ శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు.
Also Read: IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లకు టీ20 లీగ్స్‌పై జాతీయ బోర్డు కీలక సూచనలు, ఆదేశాలు
కరోనా వ్యాక్సిన్ ప్రారంభం అయిన తరువాత టీమిండియా నుంచి ప్రధాన కోచ్ రవిశాస్త్రి కోవిడ్19 టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి కొన్ని రాష్ట్రాల్లో టీకాలు మొదలుపెట్టారు. మరికొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యువతకు సైతం టీకాలుకు కావాల్సిన మోతాదుల కోసం ఎదురు చూస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook