Kapu Nestham: కాపునేస్తం రెండో విడత పంపిణీకు సిద్ధమౌతున్న ప్రభుత్వం, త్వరలో ఖాతాల్లో 15 వేల రూపాయలు

Kapu Nestham: ఆంధ్రప్రదేశ్‌లో కాపునేస్తం రెండవ విడతకు రంగం సిద్ధమవుతోంది. అర్హులైన వ్యక్తులు స్థానికంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదిస్తే..ఖాతాలో 15 వేల రూపాయలు జమ అవుతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 30, 2021, 09:30 AM IST
Kapu Nestham: కాపునేస్తం రెండో విడత పంపిణీకు సిద్ధమౌతున్న ప్రభుత్వం, త్వరలో ఖాతాల్లో 15 వేల రూపాయలు

Kapu Nestham: ఆంధ్రప్రదేశ్‌లో కాపునేస్తం రెండవ విడతకు రంగం సిద్ధమవుతోంది. అర్హులైన వ్యక్తులు స్థానికంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదిస్తే..ఖాతాలో 15 వేల రూపాయలు జమ అవుతాయి. రేపట్నించి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది.

ఏపీలో ఇప్పటికే వివిధ రకాల సంక్షేమ పథకాలు(Welfare Schemes)అమలవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ కేలండర్‌కు అనుగుణంగా అర్హుల జాబితాలో ఆర్ధిక సహాయం అందుతోంది. అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, చేయూత వంటి పథకాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీకు అనుగుణంగా కాపు సోదరుల కోసం కాపు నేస్తం(kapunestham) అమలు చేస్తోంది. కాపునేస్తంలో భాగంగా అర్హులైనవారి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు జమ అవుతాయి. ఇందులో భాగంగా 45 నుంచి 60 ఏళ్ల వయస్సున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఈ పథకం వర్తిస్తుంది.ఇప్పటికే తొలివిడతలో భాగంగా 2 లక్షల 35 వేల 873 మంది లబ్దిదారుల ఖాతాల్లో 354 కోట్లు జమ అయ్యాయి. అర్హులై ఉండి పథకం అందనివారికి 2020 నవంబర్ నెలలో మరోసారి 142 కోట్లు జమ అయ్యాయి. ఇప్పుడు రెండో విడత పథకం (Kapunestham Second Phase) అమలు సిద్ధమవుతోంది. అర్హులైనవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా ఇంటికొచ్చే వాలంటీర్ సహాయం తీసుకోవాలి. 

కాపునేస్తం రెండోవిడతలో భాగంగా జూలై 1 నుంచి 7వ తేదీ వకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాత జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. జూలై 24వ తేదీన అర్హులైనవారి ఖాతాల్లో 15 వేల రూపాయలు జమ అవుతాయి.

Also read: Disha App Campaign: మహిళల రక్షణలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు : వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News