Asia's first hybrid flying car: మేకిన్ ఇండియా స్ఫూర్తితో వచ్చిన స్టార్టప్‌ల రాకతో టెక్నాలజీ పరంగా భారత్ దూసుకెళ్తోంది. సరికొత్త ఆవిష్కరణలు మనదేశంలో వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనదేశం ఒక విషయంలో ఏషియాలో మిగిలిన దేశాలను కంటే ముందు వరుసలో నిలవనుంది. ఫస్ట్ ఫ్లయింగ్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఇండియా (India) తీవ్రంగా కృషి చేస్తోంది.
ఎమర్జెన్సీలో వైద్య సేవలు సత్వరమే అందించే వీలు
చెన్నైకి చెందిన వినత స్టార్టప్ (vinata startup) రూపొందించిన ఫ్లైయింగ్ కారుకు (flying car) సంబంధించిన ప్రోటోటైప్‌ను కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా పరిశీలించారు. దాన్ని పరిశీలించిన తర్వాత.. ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia)ప్రశంసించారు. ఈ ఫ్లైయింగ్‌కారు కాన్సెప్టు అందుబాటులోకి వస్తే మెడికల్ ఎమర్జెన్సీలో (Medical Emergency) వైద్య సేవలు సత్వరమే అందించే వీలు ఉంటుందని మంత్రి అన్నారు. మరోవైపు రోడ్ ట్రాన్స్‌పోర్టులో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం కావడంతో ఉబర్ (Uber) లాంటి సంస్థలు ఫ్లైయింగ్ కారు కాన్సెప్టుపై ఆసక్తిగా ఉన్నాయి. ఇక కొరియాకు చెందిన హ్యుందాయ్ (Hyundai) కంపెనీ కూడా ఏషియా నుంచి ఫ్లైయింగ్ కారు తయారీ పనిలో ఉంది.
Also Read : Vanijya Utsav: విజయవాడలో వాణిజ్య ఉత్సవం - 2021ను ప్రారంభించిన సీఎం జగన్, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం
1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు
వినత రూపొందించిన ఫ్లైయింగ్ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇందులో ఒకే సారి ఇద్దరు ప్రయాణించే వీలుంది. గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగరగలదు. గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్ కారు (flying car)ప్రయాణించగలదు. నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఈ కారు ప్రత్యేకత. ఈ హైబ్రిడ్ ఫ్లైయింగ్ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు.
Delighted to have been introduced to the concept model of the soon-to-become Asia’s First Hybrid flying car by the young team of @VAeromobility . 1/2 pic.twitter.com/f4k4fUILLq
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) September 20, 2021
Also Read : Shoaib Akhtar Comments: ఫస్ట్ టీమిండియా.. తర్వాత న్యూజిలాండ్... అస్సలు వదలొద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook