Traffic Cop Dragged On Car Bonnet For 1 Km: ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని పోలీసులు చెబుతూనే ఉంటారు. కొంత మంది వాటిని పెడచెవిన పెట్టి రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇలాంటి వారి నిర్లక్ష్యం కారణంగా, ఎదుటివారికి ఇబ్బందులు కలుగుతుంటాయి. కొన్ని సార్లు కొంత మంది రూల్స్ ను అతిక్రమించి కూడా భయపడకుండా పోలీసుల పైకి తిరగబడుతుంటారు.
ఇలాంటి సంఘటనలు రోజు మన దృష్టికి లేదా సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. కానీ తాజాగా ముంబాయి (Mumbai)లో జరిగిన ఒక సంఘటన నెటిజన్లను ఆగ్రహానికి గురి చేయటమే కాదు, నడిపిన వ్యక్తిపై నిప్పులు చెరిగేలా చేస్తుంది.
Also Read: Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" మూవీ రివ్యూ
అయితే, ముంబాయిలోని ఎస్‌వీ (Mumbai SV Road) రోడ్డులో విజయ్ సింగ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ (Traffic Constable Vijay Singh) ఎప్పటిలాగానే తన విధులను నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఒకతను కారులో అటుగా వస్తున్నాడు. కానీ అతను వచ్చేది రాంగ్ రూట్ కావటంతో విషయం గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ సింగ్ ఆపటానికి ప్రయత్నించాడు. కానీ ఆ వ్యక్తి సాసేమీరా ఆపలేదు.
కారును ఎలా ఆపాలో తెలియని కానిస్టేబుల్ విజయ్ సింగ్ (Vijay Singh)పైకి ఎక్కి ముందుభాగంలో ఉన్న బ్యానెట్‌పై (Car Bonnet) కూర్చున్నాడు. అయితే కారులో ఉన్న వ్యక్తిదే తప్పు ఉన్నప్పటికీ, బ్యానెట్‌పై కూర్చొన్న కానిస్టేబుల్ పై కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి అలానే కారును నడుపుకుంటూ వెళ్లాడు. ఇలా 1 కిలో మీటర్ వరకు కానిస్టేబుల్ ను బ్యానెట్‌పై కూర్చుండగానే అలానే తీసుకెళ్లాడు ఆ యువకుడు.
here is Full video!#Shocking incident at Andheri DN Nagar #Mumbai a #trafficpolice constable sat on Car bonnet to stop driver for driving in wrong direction
(He wanted to stop him to take pic for echallan) ?— @PotholeWarriors 🇮🇳 #PotholesFreeMumbai🌩🚙🛵🛣 (@PotholeWarriors) October 1, 2021
Also Read: MAA Elections 2021: షాకిచ్చిన బండ్ల గణేష్.. నామినేషన్ తిరస్కరించుకున్న నిర్మాత
అక్కడే ఉన్న కొంత మంది దీనంతటినీ ఫోన్ లలో వీడియో తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త తెగ వైరల్ అయింది. వీడియో చూసిన ఉన్నతాధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని అతడిపై ఐపీసీ 353 (IPC Section 353) (ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ), 279 (IPC Section 279) (ప్రజారణ్యంలో ర్యాష్ డ్రైవింగ్) కి గానూ కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్ అవ్వగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ముందు బాధ్యత రాహిత్యంగా వ్యవహారించటమే కాకుండా, విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ పై అలా వ్యవహరించిన యువకుడిని కఠినంగా శిక్ష పడేలా చూడాలని నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Python Sleeps in Lap of Girl: వణుకు పుట్టిస్తున్న వీడియో.. చిన్నారి ఒళ్లో 20 అడుగుల భారీ కొండచిలువ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook