Virat Kohli Slams Trolls: టీ20 వరల్డ్‌కప్‌లో (ICC T20 World Cup 2021) పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో (India Vs Pakistan) టీమ్ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే! అయితే ఈ మ్యాచ్‌లో బౌలర్ మహ్మద్ షమీ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. ఒక విధంగా భారత జట్టు ఓటమికి అదే కారణమైంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మహ్మద్ షమీపై ట్రోలింగ్ (Trolls on Shami) చేయడం మొదలుపెట్టారు. షమీతో పాటు అతడి కుటుంబసభ్యులనూ దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు. షమీపై వస్తోన్న ట్రోలింగ్ ను ఇప్పటి వరకు పలువురు క్రికెటర్లతో పాటు మాజీలు ఖండిస్తూ.. షమీకి మద్దతుగా నిలిచారు. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ను ఇప్పుడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు.
షమీపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఖండిస్తూ.. అతడికి అండగా టీమ్ లోని ఆటగాళ్లందరూ ఉన్నారన్నాడు. ఓ వ్యక్తిని మత ఆధారంగా టార్గెట్ చేయడం విషాదకరమని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని.. కానీ మతం ఆధారంగా వివక్ష చూపడం వ్యక్తిగతంగా ఇష్టపడనని కోహ్లీ తెలిపాడు. మహమ్మద్ షమీ ఇండియాకు ఎన్ని మ్యాచ్‌లను గెలిపించాడో ట్రోలర్స్‌కు తెలియదని అన్నాడు. అతని పట్టుదలపై అవగాహన లేని వారు ఏదేదో అంటుంటారని.. అలాంటి వారిపై ఒక నిమిషం కూడా ఆలోచించమని తెలిపాడు. ఈ విషయంలో షమీకే తమ మద్దతు అని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు (India Vs New Zeland) ముందు విలేకరుల సమావేశంలో టీమ్ఇండియా విరాట్ కోహ్లీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ గురించి మాట్లాడాడు. హార్దిక్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, ఆరో బౌలర్ అవసరమైతే సిద్ధంగా ఉంటాడని విరాట్ పేర్కొన్నాడు. జట్టులో శార్దూల్ ఠాకూర్ స్థానం గురించి విరాట్‌ను ప్రశ్నించగా, అతను మా ప్లానింగ్‌లో భాగమని చెప్పాడు. వారికి సామర్థ్యాలు ఉన్నాయని తెలిపాడు. అయితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాలా లేదా అనేది విరాట్ స్పష్టం చేయలేదు.
Also Read: Rashid Khan 100 Wickets: అంతర్జాతీయ టీ20ల్లో మలింగ రికార్డును బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
Also Read: Leander Paes Retirement: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన లియాండర్ పేస్.. టెన్నిస్ కు రిటైర్మెంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook