TSRTC new Offer: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ (Fuel price hike) ధరలతో ప్రయాణాలు భారంగా మారాయి. దీనితో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై రోజంతా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని సార్లు ప్రయాణించిన.. రూ.100 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. అయితే ఈ సదుపాయం కేవలం హైదరాబాద్ పరిధిలో (Special offer for Hyderabd RTC Passengers) నడిచే సిటీ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
టీ-24 టికెట్ సదుపాయం..
ఈ ఆఫర్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (IPS officer VC Sajjanar) అధికారికంగా మంగళవారం ప్రకటన చేశారు. టీ-24 (T-20 Buk ticket) పేరుతో.. 24 గంటల పాటు ప్రయాణం చేసేలా ఈ టికెట్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అంటే టికెట్ తీసుకున్నప్పటి నుంచి 24 గంటల వరకు ఇది చెల్లుబాటు అవుతుందన్న మాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టీ-24 టికెట్ తీసుకుంటే.. మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు అది పని చేస్తుంది.
Also read: Paddy seeds sale విషయంలో సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై TS High court ఆగ్రహం
ఈ టికెట్లు బస్ కండక్టర్ల వద్ద దొరుకుతాయని వెల్లడించారు సజ్జనార్. ఈ టికెట్ తీసుకుంటే.. ఏసీ మినహా ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులన్నింటిలో హైదరాబాద్‌లోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించే వీలుందని చెప్పారు.
అయితే ఇది కొత్త ఆఫర్ కాదనే చెప్పాలి.. ఇంతకు ముందు కూడా ఈ సదుపాయం ఉండేది. అయితే టికెట్ ధరలో మాత్రం మార్పు వచ్చింది.
Also read: Huzurabad Bypoll Results: పిల్లాడిలా ఏడ్చేసిన గెల్లు శ్రీనివాస్..?? వీడియో వైరల్
Also read: Huzurabad bypolls results: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం అనంతరం మీడియాతో Eatala Rajender
డ్రైవర్లు, కండక్టర్లు పాన్ మసాలా తినడంపై నిషేధం..
ఆర్టీసీ బస్సుల్లో, బస్‌స్టేషన్ ప్రాంగణంల్లో గుట్కా, పాన్‌మసాలా వినియోగంపై నిషేధం విదిస్తూ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. బస్ డ్రైవర్లు, కండక్టర్లూ అందరికీ ఇది వర్తిస్తుందని వెల్లడించారు. నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Also read: Eatala Rajender కి అందుకే మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటూ Komatireddy సంచలన వ్యాఖ్యలు
Also read: Huzurabad by-poll results: హజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన Revanth Reddy
సజ్జనార్ రాకతో భారీ మార్పులు..
సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్‌ను ఆ బాధ్యతల నుంచి ఆర్టీసీకి బదిలీ చేసింది ప్రభుత్వం. దీనితో ఆయన ఈ ఏడాది ఆగస్టు 25 నుంచి ఆర్టీసీ ఎండీగా (RTC MD VC Sajjanar) సేవలందిస్తున్నారు. సీపీగా ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఆయనకు పోలీసు విభాగంలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది.
ఆర్టీసీకి బదిలీ అయిన తర్వాత కూడా సజ్జనార్ తనదైన శైలిలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎండీ స్థాయిలో సామాన్యుడిగా కుటుంబంతో కలిసి ఓ సారి ఆర్టీసి బస్సులో ప్రయాణించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇక ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు గానూ.. ప్రజలు ఆర్టీసీని బస్సుల్లో ప్రయాణించేలా ఆఫర్లను ప్రకటిస్తున్నారు. దీనితో పండుగళ వేళ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఆర్టీసీ రూ.3 కోట్ల అదనపు ఆదాయాన్ని గడించినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఇదంతా సజ్జనార్ మార్క్ నిర్ణయాలతో నే సాధ్యమైందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
Also read: Minister KTR: హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..
Also read: Huzurabad by-poll results: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీష్ రావు స్పందన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook