వివేకానందరెడ్డి హత్యకేసులో ఇంకెవరి ప్రమేయముంది, శంకర్ రెడ్డి లేఖ సారాంశమేంటి

Vivekananda reddy Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. శంకర్ రెడ్డి అరెస్టు అనంతరం అతని కుమారుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ కేసులో కొత్త పాత్రధారులున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2021, 11:18 AM IST
  • వివేకానందరెడ్డి హత్య కేసులో మర ో కొత్త కేణం
  • శంకర్ రెడ్డి సీబీఐకు రాసిన లేఖతో కొత్త పాత్రధారులపై సందేహాలు
  • శంకర్ రెడ్డి రాసిన లేఖను విడుదల చేసిన అతని కుమారుడు చైతన్యరెడ్డి
 వివేకానందరెడ్డి హత్యకేసులో ఇంకెవరి ప్రమేయముంది, శంకర్ రెడ్డి లేఖ సారాంశమేంటి

Vivekananda reddy Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. శంకర్ రెడ్డి అరెస్టు అనంతరం అతని కుమారుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ కేసులో కొత్త పాత్రధారులున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కేసులో(Vivekananda reddy Murder Case)ఇప్పుడు సీబీఐ దూకుడు పెంచింది. అదే సమయంలో వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు అధికమయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్తగా అవినాష్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్న శంకర్ రెడ్డి అరెస్టు కావడంతో సంచలనం రేగింది. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతితో కడపకు తరలించి..పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే ఇదే సమయంలో శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి సీబీఐకు(CBI)రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ కేసులో మరెంతమంది పాత్రధారులు ఉన్నారనే సందేహాలు ఈ లేఖ ద్వారా వెల్లువెత్తుతున్నాయి.

వివేకానందరెడ్డి హత్యకేసుతో తనకు సంబంధం లేదని..ఉద్దేశ్యపూర్వకంగానే వివేకానందరెడ్డి కుమార్తె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని శంకర్ రెడ్డి(Shankar reddy) ఆ లేఖలో ప్రస్తావించారు. హత్యకు మూలకారణం ఏంటో, హత్య చేసిందెవరో సునీతకు తెలుసనీ..సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి, మరిది శివప్రకాష్‌రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మను సీబీఐ విచారించాలనీ లేఖలో డిమాండ్ చేశారు. శంకర్ రెడ్డి అరెస్టుతోనే సంచలనంగా మారిన ఈ కేసు..ఇప్పుడు తాజాగా లేఖలో సునీత సహా కుటుంబసభ్యుల ప్రస్తావన రావడం మరింత సంచలనంగా మారింది. చివరికి ఈ కేసు ఎటువంటి ముగింపు ఇస్తుందో వేచి చూడాలి. 

Also read: ఏపీ వైద్యారోగ్య శాఖలో కొత్తగా 2,190 పోస్టులు.. జగన్ సర్కారు ఉత్తర్వులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News