SS Rajamouli says Puneeth Raj Kumar treated me like family member: కన్నడ 'పవర్ స్టార్' పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Raj Kumar) ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించడంతో కన్నడ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయన లేరన్న నిజాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) తాజాగా పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పునీత్ మరణాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని దర్శక ధీరుడు అన్నారు. తనను కుటుంబసభ్యుడిలా చూసుకున్నారన్నారు.
ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం వేగవంతం చేసింది. కన్నడ సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి (Puneeth Raj Kumar) బెంగళూరు వెళ్లారు. బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్‌లో జనని కన్నడ పాటను అయన విడుదల చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరవాత రాజమౌళి నేరుగా సదాశివనగర్‌లోని పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. పునీత్ సతీమణి అశ్వినికి దర్శక ధీరుడు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. పునీత్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Also Read: Corona cases in India: తగ్గిన కరోనా కేసులు- 24 గంటల్లో 8,318 మందికి పాజిటివ్
'నాకు ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావడం లేదు. పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Raj Kumar) లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా. ఆయనను నేను తక్కువగానే కలిశాను. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్‌ని కలిశాను. ఆయన నన్ను ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు. ఎంతో సరదాగా మాట్లాడారు. ఒక స్టార్‌తో మాట్లాడుతున్నానన్న భావన నాకు ఎక్కడా కలగలేదు. పక్కింటి కుర్రాడు మాట్లాడినట్టే అనిపించింది. అలాంటిది పునీత్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యాను. పునీత్ మనకు మనకు దూరమయిన అనంతరం ఆయన ఇంటివద్ద ఇలా మాట్లాడుతానని అనుకోలేదు. చాలా బాధగా ఉంది' అని ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అన్నారు.
Also Read: Corona cases in India: తగ్గిన కరోనా కేసులు- 24 గంటల్లో 8,318 మందికి పాజిటివ్
'పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Raj Kumar) ఎంతో మందికి సాయం చేశారని ఆయన మరణం తర్వాతే అందరికీ తెలిసింది. సాధారణంగా మనం ఓ చిన్న సాయం చేసినా.. ప్రపంచానికి తెలియాలనుకుంటాం. ఈ కాలంలో ఒక్కరి సాయం చేసి చాలా మందికి చెప్పుకుంటారు. కానీ పునీత్ అలాంటి వాడు కాదు. తను ఎంతో మందికి సాయం చేసినా ఎవరికీ చెప్పలేదు. అది ఆయన గొప్ప తనం. ఆయనది గొప్ప మనసు. పునీత్ లేనిలోటు స్పష్టంగా కనపడుతోంది. అయన చేసిన సేవతో చరిత్రలో నిలిచిపోతారు' అని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) భావోద్వేగానికి గురయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook