తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి డాలర్ శేషాద్రి మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు సంతాపం డాలర్ శేషాద్రి మరణంపై సంతాపం ప్రకటించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న పి శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి(Dollar Seshadri Death) హఠాన్మరణం చెందారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన ఆయనకు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆయన మరణించారు. 1978 నుంచి శ్రీవారి సేవలోనే ఉన్న డాలర్ శేషాద్రి వాస్తవానికి 2007లో రిటైర్ అయినా..ఆయన సేవలు అవసరమై ఓఎస్డీగా కొనసాగించారు.
డాలర్ శేషాద్రి మరణం వార్త విని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించి..కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అటు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకు తీరనిలోటని చెప్పారు. శేషాద్రి సేవల్ని కొనియాడారు. జీవితాంతం శ్రీవారి సేవే ఊపిరిగా పనిచేశారన్నారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి అని చెప్పారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్దదిక్కుగా పనిచేశారన్నారు. ఆయన మరణవార్త తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.
Also read: డాలర్ శేషాద్రి హఠాన్మరణం, విశాఖలో గుండెపోటుతో కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook