CM Nitish Kumar : సీఎం తనను బ్యూటీఫుల్ అన్నాడని బాధపడ్డ మహిళా ఎమ్మెల్యే

BJP Woman MLA Nikki Hembrom : నిక్కీ (BJP MLA Nikki Hembrom).. తమ ప్రాంతంలోని కొందరు గిరిజనలు మద్యం తయారు చేస్తున్నారని వారికి ప్రత్యామ్నంగా ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. అయితే సీఎం నితీష్‌ కుమార్ జోక్యం చేసుకుంటూ.. మీరు చూడటానికి బ్యూటీఫుల్‌గా (beautiful) ఉన్నారు.. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలియదా అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 09:47 PM IST
  • బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మాటల వల్ల ఎంతో బాధపడ్డానన్న బీజేపీ ఎమ్మెల్యే
  • తనను బ్యూటీఫుల్‌ అన్నారంటూ బాధపడ్డ నిక్కీ హెంబ్రోమ్
  • బ్యూటీఫుల్‌ అని కామెంట్ చేశారని ఆవేదన
CM Nitish Kumar : సీఎం తనను బ్యూటీఫుల్ అన్నాడని బాధపడ్డ మహిళా ఎమ్మెల్యే

Bihar BJP Woman MLA Nikki Hembrom says CM Nitish Kumar used objectionable language : బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మాటల వల్ల తాను ఎంతో బాధపడ్డానంటూ బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ అన్నారు. తాజాగా జరిగిన సమావేశంలో అందరి ఎదుట తనను బ్యూటీఫుల్‌ అన్నారని ఆమె బాధపడ్డారు. సీఎం (Bihar Chief Minister Nitish Kumar) అలాంటి పదం వాడడం సరికాదన్నారు. అంతేకాదు ఈ విషయాన్ని తన పార్టీకి చెందిన సీనియర్‌ నేతలకు తెలిపినట్లు నిక్కీ చెప్పారు. 

సమావేశంలో నిక్కీ (BJP MLA Nikki Hembrom).. తమ ప్రాంతంలోని కొందరు గిరిజనలు మద్యం తయారు చేస్తున్నారని వారికి ప్రత్యామ్నంగా ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. అయితే సీఎం నితీష్‌ కుమార్ జోక్యం చేసుకుంటూ.. మీరు చూడటానికి బ్యూటీఫుల్‌గా (beautiful) ఉన్నారు.. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలియదా అన్నారు. మద్యం తయారు చేసే గిరిజన కమ్యూనిటీకి ప్రత్యామ్నా ఉపాధి మార్గాలు చూపిందన్నారు. ఆ విషయం నీకు తెలియదా.. తెలుసుకో అన్నట్లు సీఎం సమాధానం ఇచ్చారట.

Also Read : Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు..దేశంలో 4కి చేరిన కేసుల సంఖ్య..

అయితే ఈ ఘటనపై జేడియూ ( Janata Dal (United)) మహిళా నేతలు స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, సీఎం నితీష్‌ కుమార్‌ ఆమెను అవమానపరచలేదని పేర్కొన్నారు. నితీష్‌ కుమార్‌ మహిళల విషయంలో ఎప్పుడూ గౌరవంగానే ఉంటారన్నారు. ఇక ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ (RJD Lalu Prasad) కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Aacharya) ఈ విషయంపై స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై విమర్శలు చేశారు. ఈ వయసులోనూ ఇలాంటి చేష్టలు ఏమిటి అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Also Read : డిసెంబర్ మాసంలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే.. అభిమానులకు పండగే ఇగ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News