india's first Metaverse Wedding Reception: దేశంలోనే తొలిసారి మెటావర్స్ పద్ధతిలో వివాహ రిసెప్షన్ (Metaverse Wedding Reception) నిర్వహించనుంది ఓ జంట. తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు దినేష్ క్షత్రియన్‌కు జనగనందిని అనే యువతితో వచ్చే నెల మొదటి ఆదివారం శివలింగపురం గ్రామంలో పెళ్లి జరగనుంది. రిసెప్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బంధువులు, మిత్రులు ‘'మెటావర్స్'’ (Metaverse ) అనే వర్చువల్ పద్ధతిలో (virtual reality) హాజరవుతారు. ఈ జంట ఈ మధ్యే తమ ‘'అవతార్' (avatar)’ల ద్వారా కలుసుకున్న రిహార్సల్ వీడియోను దినేష్ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఇది వైరల్ గా మారింది.
I feel so proud and blessed that I have seen and taken advantage of many great opportunities in this world before millions of people have seen them, Beginning of something big! India’s first #metaverse marriage in Polygon blockchain collaborated with TardiVerse Metaverse startup. pic.twitter.com/jTivLSwjV4
— Dinesh Kshatriyan 💜 (@kshatriyan2811) January 11, 2022
"నేను క్రిప్టో మరియు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను. గత ఏడాది కాలంగా క్రిప్టోకరెన్సీకి చెందిన ఎథెరియం మైనింగ్ చేస్తున్నాను. బ్లాక్‌చెయిన్.. మెటావర్స్ కు మూలం కావడంతో.. నా పెళ్లి ఫిక్స్ అయినప్పుడు, మెటావర్స్‌లో రిసెప్షన్ నిర్వహించాలని అనుకున్నాను. నాకు కాబోయే భార్య కూడా అందుకు అంగీకరించిందని" దినేష్ చెప్పుకొచ్చాడు.
Also Read: Husband Wife Funny Videos: నిద్రపోతున్న భర్తతో భార్య ఏం చేసిందో చూడండి!
హాగ్వార్ట్స్ థీమ్ నేపథ్యంలో..
మెటావర్స్‌లో ఆగ్మెంటెడ్ రియాల్టీ, బ్లాక్‌చైన్, వర్చువల్ రియాల్టీ కలగలిసి ఉంటాయి. ఈ రంగంలోని ఒక అంకుర సంస్థతో కలిసి దేశంలోనే తొలిసారిగా మెటావర్స్ పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విటర్ ద్వారా దినేష్ ప్రకటించారు. హ్యారీపోటర్ సినిమాలోని (Harry Potter universe) హాగ్వార్ట్స్ నేపథ్య వర్చువల్ రిసెప్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరవుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook