ap schools latest news: andhra pradesh government seeks donations to build school infrastructure : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో (government schools) మౌలికసదుపాయాల (infrastructure) కల్పనకు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం రూ.6321 కోట్లు (Rs.6321 crores) అవసరమని ఏపీ ప్రభుత్వం (AP Government) ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది ఏపీ సర్కార్. (AP Sarkar) జాతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలు (Donations) సేకరించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఇక మొత్తం 48,626 గదుల్ని అదనంగా (additional rooms) నిర్మించేందుకు ఏపీ గవర్నమెంట్ (AP Government) ప్రణాళిక చేస్తోంది. అలాగే.. రాష్ట్రంలోని 44,500 పైగా ప్రభుత్వ పాఠశాలలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు అనుసంధానించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది .
ఏపీలో 44,519 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రస్తుతం 66,846 గదులు ఉన్నాయి. అయితే ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో పలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం.. ఈ పాఠశాలల్లో (ap schools) మొత్తం 1,15,472 గదులు ఉండాల్సి ఉంది.
దీంతో ఆయా పాఠశాలల్లో మొత్తం 48,626 అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. అందుకు రూ.6,321.38 కోట్లు అవసరమని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిధుల కోసం విరాళాల (donations) అన్వేషణ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఇక విరాళాల విధివిధానాలపై త్వరలోనే ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు జారీ కానున్నాయి.
అలాగే ప్రభుత్వం ఇప్పటికే ప్రతి ఏడాదికి రూ. 450 కోట్ల స్కూల్ మెయింటనెన్స్ ఫండ్ (School Maintenance Fund) కోసం అమ్మఒడి పథకం లబ్దిదారుల నుంచి రూ. 1,000 చొప్పున తీసుకుంటోంది.
అమ్మఒడి కింద ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లే 44.5 లక్షల మంది పిల్లల తల్లులకు.. ఒక్కొక్కరికీ ఏటా రూ.15,000 చెల్లించేంది. అయితే గత ఏడాది నుంచి ఒక్కొక్కరికి రూ.14వేలు మాత్రమే చెల్లిస్తోంది.
ఇక పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు అందుబాటులో లేకపోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో.. విరాళాల (donations) సేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. అయితే దాతలు ఒక పాఠశాలకు లేదా కొన్ని పాఠశాలలకు కలిపి విరాళం ఇవ్వొచ్చని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. ఇక పాఠశాలలకు (schools) చేసే ఖర్చు మొత్తాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచుతామన్నారు. అలాగే విరాళం ఇచ్చినట్లు దాతలకు (donors) ఒక సర్టిఫికెట్ అందిస్తామని ఆ ఉన్నతాధికారి చెప్పారు.
Also Read : IND vs SA 1st ODI Live Score: రాణించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 297
ఇక ఈ విరాళాల సేకరణ విదేశీ దాతలు, మల్టీ నేషనల్ కంపెనీలు, వ్యాపారవేత్తలు, తదితర మార్గాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల (infrastructure) కల్పన కార్యక్రమాన్ని 2024 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : Instagram Nationality Challenge: ఇన్‌స్టాలో నేషనాలిటీ ఛాలెంజ్ వీడియో ఎలా చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook