Today's Highlights: ఈ రోజు న్యూస్ హైలెట్స్ ఈ విధంగా ఉన్నాయి... వాటిపై ఓ లుక్కేయండి. దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. అలాగే మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్, పాకిస్తాన్ లాహోర్‌లో బాంబు పేలుడు తదితర వార్తలు ఇదిగో..
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు:
ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,17,532 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే 3.63 శాతం ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా ధాటికి దేశంలో మరో 491 మంది మరణించారు. మరోవైపు ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 76,35,229 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,58,88,47,554 కు చేరింది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్:
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కరోనా (Covid-19) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''ఈ రోజు నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని రకాల ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతున్నాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి'' అంటూ కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) ట్వీట్ చేశారు.
కేంద్రమంత్రి చేసిన ఈ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అన్న అంటూ కామెంట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కూడా కిషన్ రెడ్డి త్వరగా కరోనా నుంచి కోలుకావాలని కోరుతూ పోస్ట్ పెట్టారు.
మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు:
వాహనదారులకు షాకింగ్ న్యూస్. త్వరలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel price hiked) పెరగనున్నట్లు తెలుస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గడిచిన నాలుగు వారాల్లో 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 87.99 డాలర్ల (Brent Curde price today) వద్ద ఉంది. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
లీటర్ పెట్రోల్‌పై (Petrol Price cut) రూ.5లు, లీటర్ డీజిల్‌పై (Diesel Price cu) రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు తెలిపింది కేంద్రం. ఆ తర్వాత పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ఆ తర్వాత పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ లాహోర్‌లో బాంబు పేలుడు:
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గురువారం (జనవరి 20) బాంబు పేలుడు చోటు చేసుకుంది. పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 20 మంది గాయపడ్డారు. లాహోర్‌లో నిత్యం రద్దీగా ఉండే అనార్కలీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. షాపుల ఎదుట పార్క్ చేసి ఉన్న బైక్స్ మంటల్లో దగ్ధమయ్యాయి.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేలుడు ఘటనను (Bomb Blast) ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.. ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ధనుష్, ఐశ్వర్యల విడాకుల విషయంలోకి సమంతను లాగారు:
ధనుష్, ఐశ్వర్య (Aishwaryaa) విడిపోతున్నామంటూ చేసిన ప్రకటనతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఒక ఫ్యాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అమ్మా.. లక్ష్మీ రామకృష్ణన్ మీరే వారిద్దరినీ ఎలాగైనా కలపాలి అంటూ ఆ అభిమాని కోరాడు.
ఇక దీనిపై నటి, డైరెక్టర్ లక్ష్మీ రామకృష్ణన్ (Lakshmy Ramakrishnan) స్పందించారు. ధనుష్, ఐశ్వర్యలు పరస్పర గౌరవభావంతోనే విడిపోతున్నారంటూ పేర్కొంది లక్ష్మీ రామకృష్ణన్. ఇక దీనికి ఆ అభిమాని రిప్లై ఇచ్చాడు.. "వారి నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని, కానీ వారు సైలెంట్‌గా విడిపోయింటే బాగుండేది.. ఇలా ప్రచారం చేయడమే అస్సలు బాగోలేదంటూ" ఆ ఫ్యాన్ లక్ష్మీ రామకృష్ణన్ పోస్ట్‌పై రిప్లై ఇచ్చాడు.
Also Read : Vishwak Sen Film: ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా? అంటున్న విశ్వక్ సెన్..!
ఇక దీనిపై లక్ష్మీ మరోసారి బదులిచ్చారు. ధనుష్, ఐశ్వర్య విడిపోతున్న విషయాన్ని ఇలా బహిరంగంగా వెల్లడించకపోతే.. వారిపైన చాలా రూమర్స్, వార్తలు పుట్టుకొస్తాయని చెప్పుకొచ్చింది. సమంత, (Samantha) నాగ చైతన్య విడిపోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించినా సమంత చాలా దారుణమైన విషయాల్ని భరించాల్సి వచ్చిందంటూ పేర్కొంది లక్ష్మీ రామకృష్ణన్. అయితే ఇప్పుడు లక్ష్మీ రామకృష్ణన్ ట్వీట్ (Tweet) వైరల్‌గా మారింది. ఈ విషయంలోకి సమంతను ఎందుకు లాగుతారంటూ నెటిజెన్స్ పోస్ట్స్ చేస్తున్నారు.
Also Read : Kidnap drama: షార్ట్‌ఫిల్మ్ ఫండ్ కోసం యువకుడి కిడ్నాప్ డ్రామా- చివరకు ఏమైదంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook