Punjab Elections: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ బీజీపీపై మరోసారి విమర్శలు చేశారు. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం.. ఈడీని రంగంలోకి దించనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తున్న విషయం (Arvind Kejriwal fire on BJP) తెలిసిందే.
తమ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సంత్యేంద్ర జైన్‌పై మరోసారి ఈడీ అధికారులు డాదులు చేసి.. అరెస్ట్ చేస్తారనే సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు అరవింద్ (Satyendar Jain arrest) కేజ్రివాల్.
అయితే గతంలో కూడా రెండు సార్లు సత్రేంద్ర జైన్‌పై ఇలాంటి దాడులు జరిగినా.. ఎలాంటి విషయాలు కనుగొనలేదన్నారు. ఈ సారి కూడా వాళ్లకు స్వాగతం అంటూ.. కేజ్రివాల్ (Arvind Kejriwal దల ED) సెటైర్ వేశారు.
గతంలో 2018లో సీబీఐ.. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్రేంద్ర జైన్ ఇఁట్లో సోదాలు నిర్వహించింది. ఆ తర్వతా ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. నియామకాల విషయంలో సత్రేంద్ర జైన్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ కేసు (ED Case on Satyendar Jain) నమోదైంది.
ఈ విషయాలన్నింటిని గుర్తు చేస్తూ.. కేజ్రివాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసినా తాము భయపడమని స్పష్టం (Delhi CM Arvind Kejriwal on ED raids) చేశారు.
సత్రేంద్ర జైన్ వద్దకు మాత్రమే కాకుండా.. తనపైకి, మనీశ్ సిసోడియా, భగవంత్ మాన్ ఇంటికి కూడా ఈడీని పంపాలన్నారు. ఏ సంస్థలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Also read: Omicron Variant Twice: ఒకే వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎన్నిసార్లు సోకుతుందో తెలుసా..?
Also read: Arunachal Missing Boy: ఎట్టకేలకు అతని ఆచూకీ లభ్యం.. భారత్‌కు అప్పగిస్తామన్న చైనా ఆర్మీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook