CM KCR-Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఫోన్ చేశారు. ఇటీవల చిరంజీవికి (Chiranjeevi) కరోనా సోకడంతో కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ (Covid-19) నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకినట్లు చిరంజీవి బుధవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు మెగాస్టార్ తెలిపారు.
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. కరోనా ఏ రంగాన్ని వదలిపెట్టడం లేదు. ముఖ్యంగా సినీరంగంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు నటులు కొవిడ్ బారిన పడ్డారు. నిన్న చిరంజీవితో (Megastar Chiranjeevi) పాటు మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Hero Srikanth) కరోనా బారిన పడ్దారు. అంతకుముందు మహేశ్ బాబు, థమన్, మంచులక్ష్మి, విశ్వక్ సేన్, యానీమాస్టర్ తదితరులు కరోనాకు గురయ్యారు. చిరంజీవి నటించిన 'ఆచార్య' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ బోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నారు.
Also Read: Breaking News: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook