/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏర్పడిన గందరగోళాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టత ఇచ్చింది. తమకు ఉన్న సమాచారం మేరకు ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.  

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఏపీ రాజధాని ఏదనే విషయంపై ప్రజలు గందగోళానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది? రాష్ట్ర రాజధాని విషయంపై ఎవరు నిర్ణయం తీసుకోవాలి?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్ వేదికగా సమాధానమిచ్చారు.  

"ఆంధ్రప్రదేశ్ మొదట రాజధాని అమరావతి అని మాకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్ గా కర్నూలు, పరిపాలన రాజధానికి అమరావతి అని రెండోసారి మాకు వివరించారు. అయితే ఆ బిల్లును వెనక్కి తీసుకున్నట్లు వార్తల ద్వారా తెలుసుకున్నాం. ప్రస్తుతం మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రస్తుతం అమరావతిగానే ఉంది" అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్ లో వెల్లడించారు.   

Also Read: APSRTC Employees Strike: సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు.. ఏపీలో ఆ రోజు నుంచి బస్సులు బంద్?

Also Read: AP Covid-19 Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు...కొత్త కేసులు ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Central Minister Nityanand Rai has made clear statement in Parliament that the capital of Andhra Pradesh is Amaravati
News Source: 
Home Title: 

Andhra Pradesh Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే- కేంద్ర సహాయమంత్రి పార్లమెంట్ లో ప్రకటన

Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే- కేంద్ర సహాయమంత్రి పార్లమెంట్ లో ప్రకటన
Caption: 
Central Minister Nityanand Rai has made clear statement in Parliament that the capital of Andhra Pradesh is Amaravati | Zee Media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పార్లమెంట్ లో కీలక ప్రకటన
  • ప్రస్తుతం ఏపీ క్యాపిటల్ అమరావతే అని స్పష్టం
  • రాజధాని ఎంపికపై రాష్ట్రప్రభుత్వానికి స్వేచ్ఛ ఉందని వెల్లడి
Mobile Title: 
Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే- పార్లమెంట్ లో అధికారిక ప్రకటన
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, February 2, 2022 - 12:50
Request Count: 
107
Is Breaking News: 
No