Saudi Arabia Warns Whatsapp Users: సౌదీ అరేబియాలో వాట్సాప్ యూజర్లకు ఇదొక హెచ్చరిక. ఇకనుంచి వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవు. ఇందుకు రూ.20 లక్షల జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. సౌదీ అరేబియాకు చెందిన సైబర్ క్రైమ్ నిపుణుడు ఒకరు ఈ విషయాలు వెల్లడించారు.
గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం... వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు. వాట్సాప్‌లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపించడం వేధింపుల నేరమవుతుందని పేర్కొన్నారు. ఎదుటివారు కేసు నమోదు చేస్తే చిక్కుల్లో పడక తప్పదని హెచ్చరించారు. కాబట్టి వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయొద్దన్నారు. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్‌లో సంభాషణలు జరపవద్దన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో జాగ్రత్తపడాలన్నారు.
సౌదీ అరేబియాలో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని వేధింపుల కింద పరిగణిస్తారు. అక్కడి ఆచార సాంప్రదాయాల ప్రకారం వాట్సాప్‌లో రెడ్ హార్ట్ లేదా రెడ్ రోజెస్ వంటి ఎమోజీలను పంపించడం తమ గౌరవానికి భంగంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే దోషికి 1లక్ష సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు దోషిగా తేలితే 3లక్షల సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధించడంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
Also Read: CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే విషెస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook