Samosa for Just Rs.2.50: ఒకప్పుడు రూపాయికి నాలుగు పానీపురి వచ్చేవి. ఇప్పుడు రూ.10కి నాలుగు లేదా ఐదు పానీపురి వస్తున్నాయి. పానీపురి మాత్రమే కాదు.. గడిచిన కొన్నేళ్లలో దేశంలో ఎన్నో తినుబండారాల రేట్లు పెరిగిపోయాయి. వంట నూనె, పప్పులు వంటి నిత్యావసర వస్తువల దరలు పెరిగిపోవడంతో ఆ ప్రభావం స్ట్రీట్ ఫుడ్‌పై కూడా పడుతోంది. దీంతో వీధి వ్యాపారస్తులు తినుబండారాల ధరలు పెంచక తప్పట్లేదు. అలా ధరలు పెరిగినవాటిల్లో సమోసా కూడా ఉంది. అయితే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చెందిన ఓ 75 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఇప్పటికీ రూ.2.50కే సమోసా విక్రయిస్తున్నాడు.
గడిచిన 11 ఏళ్లలో సమోసాపై అతను కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచినట్లు చెబుతున్నారు. సమోసా ప్రియులకు దాన్ని తక్కువ ధరలో అందించే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమోసా అంకుల్ స్టోరీని ఫుడ్ బ్లాగర్ సరబ్‌జిత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నపాటి షాపులోనే చాలా ఏళ్లుగా ఆ వృద్దుడు సమోసాలు తయారుచేస్తున్నాడు. ఇంత వయసులోనూ హెల్పర్‌ని నియమించుకోకుండా ఒక్కడే సమోసాలు తయారుచేసి విక్రయిస్తున్నాడు.
ఈ సమోసా అంకుల్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సరబ్‌జిత్ సింగ్ షేర్ చేసిన వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నాడు. 'నాకు ఆయన తెలుసు. అప్పట్లో నేను మహ్నా సింగ్ రోడ్‌లోని ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటప్పుడు రూ.1కే సమోసా అమ్మేవాడు. 11 ఏళ్ల తర్వాత కూడా కేవలం రూ.2.50కే సమోసా అమ్ముతున్నాడు. సెల్యూట్ అంకుల్ జీ..' అని కామెంట్ చేశాడు. ఇన్‌స్టాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకి ఇప్పటికే 1,46,050 లైక్స్ వచ్చాయి.
Also Read: How To Break shivratri Fasting: శివరాత్రి ఉపవాసం తర్వాత ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదట
Also Read: Adipurush Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook