Rahul Gandhi vs Minister KTR: హైదరాబాద్: తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తీవ్రంగా ఖండించారు. మీ పార్టీకి 50కిపైగా ఏళ్లు దేశాన్ని పాలించే అవకాశం ఇస్తే రైతుల కోసం కనీసం 6 గంటల విద్యుత్ ఇవ్వలేకపోయారని.. విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. మీ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో చేయలేని పనిని మా ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఏడేళ్లలో చేసి చూపించారని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి రైతు సంక్షేమ పథకాలతో తమ ముఖ్యమంత్రి వ్యవసాయం రూపురేఖలనే మార్చేశారని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి అంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కి బదులిస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఈ కౌంటర్ ఇచ్చారు.
Rahul Ji,
Your party has been given opportunity to govern this country for over 50+ years. When in power INC couldn’t provide even 6 hours of electricity to farmers causing distress & suicides
In Telangana with innovative schemes like Rythu Bandhu, Rythu Bhima, Mission Kakatiya https://t.co/s4RDdrp8pJ
— KTR (@KTRTRS) March 29, 2022
ఇదిలావుంటే, అంతకంటే ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌కి ట్విటర్ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ అహంకారపూరిత వైఖరి కారణంగానే కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో రెండంకెలకు పరిమితం అయిందని కవిత (TRS MLC Kavitha) ఎద్దేవా చేశారు.
Also read : Dhalita Bandhu: ఎమ్మెల్యే తమ్ముడికి దళిత బంధు.. గులాబీ లీడర్లకే పథకాలా..?
Also read : AAP in Telangana: తెలంగాణలో ఆప్ వల్ల ఎవరికి నష్టం..ఎవరికి ప్రయోజనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook