Viral Video: ఫోన్ మాట్లాడుతూ.. మ్యాన్ హోల్‌లో పడిపోయిన మహిళ.. తరువాతేమ్ జరిగింది?

Viral Video Woman fall into Manhole: ఫోన్ సంభాషణలో మునిగిపోయిన ఓ మహిళ.. రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్‌ను గమనించలేదు. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆమె ఒక్కసారిగా మ్యాన్ హోల్‌లో పడిపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 06:51 PM IST
  • ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లి మ్యాన్ హోల్‌లో పడిపోయిన మహిళ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • బీహార్‌లోని పాట్నాలో చోటు చేసుకున్న ఘటన
Viral Video: ఫోన్ మాట్లాడుతూ.. మ్యాన్ హోల్‌లో పడిపోయిన మహిళ.. తరువాతేమ్ జరిగింది?

Viral Video Woman fall into Manhole: ఫోన్‌లో మాట్లాడుతూ ఓ దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మ్యాన్ హోల్‌లో పడిపోయింది. ఫోన్ సంభాషణలో మునిగిపోయిన ఆ మహిళ.. ముందు మ్యాన్ హోల్ ఉన్న విషయాన్ని గమనించలేదు. అయితే అదృష్టవశాత్తు అక్కడే ఉన్నకొందరు వెంటనే ఆ మహిళను మ్యాన్ హోల్ నుంచి పైకి లాగి రక్షించారు. ఆ మహిళకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీహార్‌లోని పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మహిళకు ఎటువంటి గాయాలు కానప్పటికీ... డ్రైనేజీలో పడిపోవడంతో ఆమె దుస్తులన్నీ బురదమయం అయ్యాయి. పక్కనే ఉన్న బిల్డింగ్‌ సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఉత్కర్ష్ సింగ్ అనే నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. వీడియో  చూసిన నెటిజన్లు.. కొందరు ఆ మహిళదే తప్పు అని కామెంట్ చేయగా.. మరికొందరు అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడుతున్నారు. 

మ్యాన్ హోల్‌ను తెరిచి ఉంచడం వల్లే ఆమె అందులో పడిపోయిందని కొందరు కామెంట్ చేయగా... రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఫోన్‌ పైనే ధ్యాస పెట్టకుండా కాస్త వెనకా, ముందు చూడాలని మరికొందరు అంటున్నారు.

Also Read: Goa Special Permit: గోవా వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా తప్పదు!

Also Read: KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ వసూళ్ల సునామీ... 9వ రోజు కలెక్షన్లు ఎంతంటే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News