జనసేన ఎక్కడా గెలవదు: జలీల్ ఖాన్

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ జనసేన ఎక్కడా గెలవదని టీడీపీ ఎంఎంఏ జలీల్ ఖాన్ బుధవారం విజయవాడలో వ్యాఖ్యానించారు.

Last Updated : Apr 5, 2018, 08:55 AM IST
జనసేన ఎక్కడా గెలవదు: జలీల్ ఖాన్

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్కసీటు కూడా రాదని టీడీపీ ఎంఎల్ఏ జలీల్ ఖాన్ బుధవారం విజయవాడలో వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు పవన్‌కు తన మాట మీద స్థిరత్వం లేదని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో మరో మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాజీ మంత్రి మాణిక్యాల రావు మాటలతో స్పష్టమైందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఎవరైనా తమ పార్టీ బలంగా ఉందంటారు.. కానీ పవన్‌ కల్యాణ్‌ బలంగా ఉన్నారని బీజేపీ నాయకులే చెబితే ఎలా అని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం వెనక ఎంత మంది కాపులున్నారో, పవన్‌ కల్యాణ్‌ వెనుక అంతే మంది కాపులున్నారని తెలిపారు. వాళ్లు అప్పుడప్పుడు పోరాడుతున్నారని, తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎంతమంది కలిసినా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇబ్బంది లేదని అన్నారు. మరో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ స్థిరత్వం లేని మనిషని తేలిపోయిందని వ్యాఖ్యానించారు.

Trending News