IPL 2022 Qualifier 1, Gujarat Titans vs Rajasthan Royals Playing XI, GT vs RR Dream 11 prediction: ఐపీఎల్ 2022 లీగ్ దశ ముగియగా.. నేడు ప్లే ఆఫ్స్ మొదలు కానున్నాయి. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కి చేరనుండగా.. ఓడిన జట్టుకి ఫైనల్‌కి వెళ్లేందుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరో అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ మ్యాచులోనే గెలిచి ఫైనల్ వెళ్లాలని ఇరు జట్లు చూస్తున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7 గంటలకి టాస్ పడనుండగా.. 7.30 మ్యాచ్ మొదలవనుంది.
ఈ ఏడాదే ఐపీఎల్‌లో ప్రవేశించిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశలో అద్బుత ప్రదర్శన చేసింది. వరుస మ్యాచులు గెలుస్తూ అందరికంటే ముందే ప్లే ఆఫ్స్ దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన గుజరాత్ ఏకంగా 10 మ్యాచులు గెలిచి 20 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. క్వాలిఫయర్-1లో కూడా అదే జోరు చూపాలని చూస్తోంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా మంచి ఆరంభాలు ఇస్తున్నారు. కీలక మ్యాచులో కూడా ఈ జోడి చెలరేగాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ముఖ్యంగా గిల్ ఆటపైనే అందరికి కళ్ళు ఉన్నాయి.
గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బ్యాట్, బంతితో రాణించడమే కాకుండా అద్భుత కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. ఇది గుజరాత్ జట్టుకు కలిసొచ్చే అంశం. మాథ్యూ వేడ్ డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మిల్లర్, తెవాతియా ద్వయంపై భారీ అంచనాలు ఉన్నాయి. రషీద్ సైతం లీగ్ దశలో ఓడిపోయే ఒకట్రెండు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. సాయి కిశోర్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్ బంతితో రాణిస్తున్నారు. వీరికి రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు.
ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం తర్వాత రాజస్థాన్ రాయల్స్ సమష్టిగా రాణిస్తూ ప్లే ఆఫ్స్ చేరింది. 14 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ 9 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఓపెనర్ జోస్ బట్లర్‌పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ సీజన్‌లో బట్లర్ 14 మ్యాచ్‌లల్లో ఏకంగా 629 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లీగ్ దశలో దుమ్మురేపిన బట్లర్.. ఈరోజు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో చూడాలి. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్ రాణిస్తున్నారు. షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ అశ్విన్ సహా ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఒబెద్ మెక్‌కే, ప్రసిద్ కృష్ణ, కుల్‌దీప్ సేన్‌లతో కూడిన బౌలింగ్ కూడా బలంగా ఉంది.
తుది జట్టు:
రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కే, యజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ/కుల్‌దీప్ సేన్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్, యష్ దయాళ్.
డ్రీమ్ 11 టీమ్:
వృద్ధిమాన్ సాహా, జోస్ బట్లర్ (కెప్టెన్), సంజు శాంసన్, డేవిడ్ మిల్లర్, శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యుజ్వేంద్ర చహల్, మహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్.
Also Read: Sri Lanka Petrol: మరోసారి భారీగా పెరిగిన చమురు ధరలు.. లీటర్ పెట్రోల్ రూ.420, డీజిల్ రూ.400!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
GT vs RR Playing XI: క్వాలిఫయర్-1లో టాప్ జట్ల మధ్య పోటీ.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే! తుది జట్లు ఇవే!
క్వాలిఫయర్-1లో టాప్ జట్ల మధ్య పోటీ
అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే
గుజరాత్ vs రాజస్తాన్ తుది జట్లు