డుప్లెసిస్ ఆర్‌సీబీ తలరాతను మార్చాడు.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్‌

Faf du Plessis praises Faf du Plessis Captaincy and slams Virat Kohli. ఐపీఎల్ 2022 సీజన్లో బెంగళూరుని అద్భుతంగా ముందుకు నడిపిన ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కొనియాడారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 05:56 PM IST
  • డుప్లెసిస్ ఆర్‌సీబీ తలరాతను మార్చాడు
  • విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్‌
డుప్లెసిస్ ఆర్‌సీబీ తలరాతను మార్చాడు.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్‌

Virat Kohli drop players, Faf du Plessis changed RCB fortune says Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్‌కు వెళ్లింది. ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆడిన బెంగళూరు లీగ్ దశలో ఎనిమిది విజయాలు, ఆరు ఓటములను ఎదుర్కొని.. 16 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఇక బుధవారం (మే 25) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచులో కేఎల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ సీజన్లో జట్టుని అద్భుతంగా ముందుకు నడిపిన డుప్లెసిస్ కెప్టెన్సీని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కొనియాడారు. 

ఐపీఎల్ 2021 అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దాంతో ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్‌ని బెంగళూరు యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. సంజయ్ బంగర్ 15వ ఎడిషన్ ప్రారంభానికి ముందే బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ ఇద్దరి అండతో బెంగళూరు అద్భుత విజయాలను అందుకుంది. దాంతో ఫాఫ్, బంగర్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో కోహ్లీకి పరోక్షంగా చురకలు అంటించారు. 

తాజాగా క్రిక్‌బజ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ... 'ప్రధాన కోచ్‌గా సంజయ్ బంగర్, కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ రాకతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆలోచన, వ్యూహాల్లో మార్పులు వచ్చాయి. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నపుడు ఓ ఆటగాడు 2-3 మ్యాచ్‌లలో పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే తుది జట్టు నుంచి తప్పించేవాడు. కోహ్లీ ఎలా ఆలోచిస్తాడో మనం ఇప్పటికే చూశాం. కానీ బంగర్, డుప్లెసిస్ దాదాపుగా ఒకే జట్టును బరిలోకి దించారు. ఒకే ఒక మార్పు (అనూజ్‌ రావత్‌) చేశారు. ఫాఫ్ కెప్టెన్సీలో నిలకడగా ముందుకు సాగడం బెంగళూరుకు కలిసి వచ్చింది' అని అన్నారు. 

'గత సంవత్సరాలలో మాదిరి విరాట్ కోహ్లీ మరియు ఏబీ డివిలియర్స్ వంటి వారిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆధారపడలేదు. ఈసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చాలా మ్యాచులు గెలిపించారు. దాదాపు నలుగురు ఆటగాళ్లు బాగా ఆడారు. నేను బౌలింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. దినేష్ కార్తీక్, గ్లెన్ మాక్స్‌వెల్ కొన్ని గేమ్‌లను గెలిపించారు. బెంగళూరు ఈ సంవత్సరం అద్భుతంగా కనిపిస్తోంది' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. ఒకవేళకోహ్లీలా సంజయ్‌, డుప్లెసిస్‌ ఆలోచించి ఉంటే.. ఈ విజయాలు సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు వీరూ. 

Also Read: RCB IPL: చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్రపంచ రెండో జట్టుగా రికార్డు! తొలిస్థానం ఎవరిదంటే

Also Read: AB de Villiers IPL: ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త.. ఏబీ డివిలియర్స్ వచ్చేస్తున్నాడు! అసలు ట్విస్ట్ ఏంటంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News