Pakka Commercial Trailer: సెల్యూట్‌ కొట్టించుకోవడానికి.. నేను హీరోని కాదురా విలన్‌!

Gopichand, Raashi Khanna's Pakka Commercial Trailer Released. గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పక్కా కమర్షియల్‌ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 05:33 PM IST
  • సెల్యూట్‌ కొట్టించుకోవడానికి
  • నేను హీరోని కాదురా విలన్‌
  • పక్కా కమర్షియల్‌ ట్రైలర్‌ చూశారా
Pakka Commercial Trailer: సెల్యూట్‌ కొట్టించుకోవడానికి.. నేను హీరోని కాదురా విలన్‌!

Gopichand, Raashi Khanna starrer Pakka Commercial Trailer Released: మ్యాచో స్టార్ గోపీచంద్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి కాంబోలో వస్తున్న యాక్షన్‌ కామెడీ చిత్రం 'పక్కా కమర్షియల్‌'. గోపీచంద్‌ సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్‌పై బ‌న్నీ వాసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పక్కా కమర్షియల్‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  

గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (జూన్ 12) సాయంత్రం పక్కా కమర్షియల్‌ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 2 నిమిషాల 20 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్‌.. 'వన్స్‌ వాడు కేసు ఒప్పుకున్నాడంటే.. ఎంత పెద్ద నేరం చేసిన క్లైంట్‌ అయినా బోనులో తడి గుడ్డేసుకుని కూర్చోవచ్చు' అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. 'సెల్యూట్‌ కొట్టించుకోవడానికి.. నేను హీరోని కాదురా విలన్‌' అని గోపీచంద్‌ చెప్పే డైలాగ్ బాగుంది. 'పది సంవత్సరాల పాత్ర, 15వ ఏట ఆరంభించిన నటన యాత్ర', 'కారెక్టర్‌ని చంపేసావని కోర్టుకెక్కావా'అనే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

ఓవైపు యాక్షన్‌, మరోవైపు కామెడీతో గోపీచంద్‌ ఆహా అనిపించాడు . జూనియర్‌ లాయరుగా రాశీ ఖన్నా తనదైన మార్క్‌ నవ్వులు పూయించింది. శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, వైవా హర్ష తమదైన శైలిలో కామెడీ పంచేలా ఉన్నారు. ఇక సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు డైరెక్టర్ మారుతి. జేక్స్‌ బెజోయ్‌ సంగీతం బాగుంది. లాయరైన హీరో రౌడీలతో ఎందుకు ఫైట్‌ చేయాల్సి వచ్చింది?, కన్నతండ్రే హీరోపై ఎందుకు ఛాలెంజ్‌ చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Also Read: Elephant Attack: వృద్ధురాలిపై దాడి చేసి చంపేసిన ఏనుగు.. అంత్యక్రియల సమయంలో చితి వద్దకు వెళ్లి..!  

Also Read: Anushka Sharma: పెళ్లయినా తగ్గేదేలే.. స్విమ్ సూట్ ధరించి అనుష్క శర్మ సెల్ఫీలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News