Umpire Catch: క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన అంపైర్‌.. చివరికి ఏమందంటే?

Umpire Kumar Dharmasena tries to take a catch. అంపైర్‌ కుమార్‌ ధర్మసేన క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు నవ్వుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 01:33 PM IST
  • క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన అంపైర్‌
  • చివరికి ఏమందంటే?
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Umpire Catch: క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన అంపైర్‌.. చివరికి ఏమందంటే?

Umpire Kumar Dharmasena tries to take a catch: సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఫీల్డర్, వికెట్ కీపర్ క్యాచ్‌లు పట్టడం సహజమే. కఠినమైన క్యాచ్‌లు సైతం పట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా ఓ అంపైర్‌ కూడా క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచులో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయంలోకి వెళితే.. 

జూన్ 19న కొలంబో వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ ఆలెక్స్‌ క్యారీ షార్ట్‌ పిచ్‌ బాల్‌ను స్వ్కేర్‌ లెగ్‌ దిశగా ఆడాడు. స్క్వేర్ లెగ్‌లో అంపైర్‌గా ఉన్న కుమార్‌ ధర్మసేన క్యాచ్‌ అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తను ఫీల్డర్‌ కాదని గ్రహించి చివరి క్షణంలో ధర్మసేన తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో బంతి కిందపడి అతడికి దూరంగా వెళ్లిపోయింది. 

అంపైర్‌ కుమార్‌ ధర్మసేన క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు నవ్వుకున్నారు. గా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చుసిన అందరూ అంపైర్ ధర్మసేనపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'ధర్మసేన అంపైర్‌ కాదు.. ఫీల్డర్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇదేందయ్యా ఇది ఇదెక్కడా చూడలే' అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. 

ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. కొలంబో వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఆసీస్ 296 పరుగులు చేయగా.. 48.3 ఓవర్లలో లంక 292 రన్స్ చేసి విజయాన్ని అందుకుంది. ఇరు జట్లు మద్య నాలుగో వన్డే కొలంబో వేదికగా మంగళవారం జరగనుంది. ఈ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. 

Also Read: Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్‌కు కరోనా పాజిటివ్.. ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లేది ఇక డౌటే..?

Also Read: Deepak Chahar Dance: సతీమణి ముందు తేలిపోయిన దీపక్‌ చహర్‌.. జయా భరద్వాజ్‌ డాన్స్ అదుర్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News