Bulldozer destroys hundreds of illegal Bikes in New York: ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రద్దీ రోడ్లపై బైక్ రాయుళ్లు చేసే 'డర్ట్ బైక్ రేసింగ్' కారణంగా ఆమెరికాలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అమెరికాలోని చాలా నగరాల్లో ఈ డర్ట్ బైక్ రేసింగ్ కారణంగా చాలా న్యూసెన్స్ జరుగుతోంది. ఎన్నో ప్రమాదాలకు కారణమవడమే కాకుండా సౌండ్ పొల్యూషన్ కూడా అవుతుంది. సాధారణ బైక్‌లను కాకుండా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే స్పోర్ట్స్ బైక్‌లను రేసింగ్ కోసం రేసర్లు వాడడమే ఇందుకు ప్రధాన కారణం.
సాధారణంగా 'డర్ట్ బైక్ రేసింగ్'కు రిజిస్ట్రేషన్ లేని వాహనాలనే రేసర్లు ఎక్కువగా వాడుతుంటారు. న్యూయార్క్‌లో ఈ రేసింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. రాత్రి సమయంలో సాధారణ ప్రజలకు ఇది ప్రమాదకరంగా మారుతోంది. దీన్ని ఎలాగైనా అరికట్టాలని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కంకణం కట్టుకున్నారు. మేయర్ ఆదేశాల మేరకు న్యూయార్క్ పోలీసులు ఈ రేసింగ్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని వందల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ లేని బైక్‌లన్నింటినీ ఓ మైదానంలోకి చేర్చి వాటి మీద బుల్డోజర్ ఎక్కించి ధ్వంసం చేశారు. బుల్డోజర్ ఎక్కగానే బైక్స్ అన్ని సర్వనాశనం అవుతూ వచ్చాయి. పక్కనే కార్లు కూడా ధ్వంసం అయినట్టు ఉన్నాయి. బుల్డోజర్ వాటిపై ఎక్కుతుంటే.. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అక్కడే ఉండి వీడేమో తీశారు. అక్రమ వాహనాలను కలిగి ఉన్న మరియు నడుపుతున్న వారికీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకు మేయర్ వీడియో తీశారట.
New York City Mayor Eric Adams waved a checkered flag to start a bulldozing event, where 100 illegal dirt bikes and all-terrain vehicles, confiscated by the New York City Police Department, were crushed pic.twitter.com/DuzKOnWwAN
— Reuters (@Reuters) June 22, 2022
'మీరు మా ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారా?. అయితే మీ పని అయిపోయినట్టే' అని మేయర్ కార్యాలయం ట్వీట్ చేసింది. బైక్‌లపై బుల్డోజర్ ఎక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆకతాయిలు పాల్గొనే ఈ రేసింగ్ చాలా ప్రమాదకరమని, అందుకే అలాంటి బైక్‌లను గుర్తించి నాశనం చేశామని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.
Also Read: Karate Kalyani on Ram Gopal Varma : శ్రీకాంత్ రెడ్డి ట్రీట్మెంట్ వర్మకు కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.