Thief Funny Video: వీడో వెరైటీ దొంగ.. గన్ పెట్టి మొబైల్ కొట్టేశాడు! చివరకు ఊహించని ట్విస్ట్

Thief uses fake gun and steals mobile phone. ఓ తెలివైన దొంగ బొమ్మ తుపాకీ చూపించి నడి  రోడ్డుపై సునాయాసంగా మొబైల్ కొట్టేస్తాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 5, 2022, 02:46 PM IST
  • వీడో వెరైటీ దొంగ
  • గన్ పెట్టి మొబైల్ కొట్టేశాడు
  • చివరకు ఊహించని ట్విస్ట్
Thief Funny Video: వీడో వెరైటీ దొంగ.. గన్ పెట్టి మొబైల్ కొట్టేశాడు! చివరకు ఊహించని ట్విస్ట్

Thief uses fake gun and steals mobile phone: దొంగలకు కూడా తమదైన శైలి ఉంటుంది. కొంతమంది దొంగలు రాత్రి పూట దొంగతనానికి వెళితే.. మరికొందరు పట్టపగలే దోపిడీలకు పాల్పడుతారు. పట్టపగలే దొంగతనానికి వెళ్లే వారికి చాలా తెలివి, ధైర్యం ఉండాలి. తాజాగా ఓ తెలివైన దొంగ బొమ్మ తుపాకీ చూపించి నడి  రోడ్డుపై సునాయాసంగా మొబైల్ కొట్టేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియో ప్రకారం... ఓ రద్దీ రోడ్డుపై వాహనాలు జోరుగా వెళుతున్నాయి. రోడ్డు పక్కనే కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉండగా.. వాటి ముందు ఓ వ్యక్తి కుర్చీలో కూర్చుని తన మొబైల్‌తో ఆడుకుంటూ ఉంటాడు. ఎడమ సైడ్ ఓ కుర్రాడు కూడా ఉంటాడు. ఇంతలో ఓ దొంగ మొహానికి ముసుగు వేసుకుని వచ్చి కుర్చీలో కూర్చున్న వ్యక్తిని దాటుకుంటూ వెళతాడు. ఇదేమీ పట్టించుకోని అతడు మొబైల్‌ చూస్తూ ఉంటాడు. వెనక్కి వచ్చిన దొంగ దాచుకున్న గన్ తీసి.. మొబైల్ ఇవ్వమని బెదిరిస్తాడు. ఒక్కసారిగా షాక్ తిన్న అతడు మొబైల్ ఇచ్చేస్తాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Supercars 🏆 Cars 🏆 Exotics (@superautovip)

ఇది గమనించిన పక్కనే ఉన్న కుర్రాడు ముందు వచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో మొబైల్ తీసుకున్న దొంగ కుర్రాడి వైపు తిరగ్గానే గన్ కనిపించడంతో వెనక్కి తగ్గుతాడు. ఆపై దొంగ కాల్చినా అతడికి ఏమి కాదు. ఇంతలో మరో అతను బైక్ వేసుకుని రాగా.. సదరు దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే దొంగ దగ్గర ఉంది బొమ్మ తుపాకీ అన్నమాట. ఈ వీడియోను superautovip అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బొమ్మ తుపాకీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. 

Also Read: IND vs ENG Racism: భారత అభిమానులపై జాతి వివక్ష వ్యాఖ్యలు.. కర్రె, పాకీ బాస్టర్డ్స్ అంటూ..!  

Also Read: Upasana Konidela: పిల్లల్ని కనొద్దన్న సద్గురు.. ఉపాసన ఏమన్నారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News