Virat Kohli, Rohit Sharma eye on Paul Stirling's T20 Record: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టీ20కి సిద్ధమవుతోంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఈరోజు (జులై 9) భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ పట్టాలని చూస్తోంది. మరోవైపు తొలి టీ20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని.. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లండ్ బావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
రెండో టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ మరో రెండు బౌండరీలు బాదితే.. టీ20 ఫార్మాట్లో 300 ఫోర్ల మైలురాయిని అందుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరి పొట్టి ఫార్మాట్లో 298 బౌండరీలు బాదారు. ఈ జాబితాలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ టాప్‌లో ఉన్నాడు. 104 టీ20ల్లో 325 బౌండరీలు బాదాడు. కోహ్లీ 97 మ్యాచుల్లో 298 ఫోర్లు బాధగా.. రోహిత్ 126 మ్యాచుల్లో అన్నే ఫోర్లు బాదాడు. అయితే ఈ అరుదైన ల్యాండ్ మార్క్‌ను ఈ ఇద్దరిలో ముందుగా ఎవరు అందుకుంటారనేది చూడాలి.
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ బ్యాటర్‌గా క్రీజ్‌లోకి వస్తాడు. కోహ్లీతో పోల్చుకుంటే.. రోహిత్ తొలిసారిగా 300 బౌండరీల మార్క్‌ను అందుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు బౌండరీలే కాబట్టి రోహిత్ మొదటి ఓవర్లోనే బాదినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇషాన్ కిషన్ విఫలమవుతున్న నేపథ్యంలో కోహ్లీ కూడా ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన విషయం తెలిసిందే.
Also Read: Virat Kohli: జట్టులో చోటు కోసం యువకుల పోటీ.. విరాట్ కోహ్లీకి ఇదే చివరి అవకాశమా!
Also Read: Dog Viral Video: ఈ కుక్క చేసే పని చూస్తే.. వావ్ అనకుండా ఉండలేరు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook