How To Lose Weight At Home In 7 Days: అనారోగ్యమైన ఆహారం తీసుకుని చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే బరువు పెరగడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడమేనని.. అంతేకాకుండా వివిధ రకాల చెడు కొలెస్ట్రాల్ పరిమాణం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆయుర్వేద చిట్కాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువును నియంత్రించడానికి ఉసిరికాయను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు.
ఉసిరికాయ వల్ల శరీనికి చాలా ప్రయోజనాలు:
బరువును నియంత్రిస్తుంది:
ప్రతి రోజూ ఉదయం ఉసిరి జ్యూస్ తాగడం వల్ల శరీర బరువును నియంత్రించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌పై ప్రభావవంతంగా పని చేసి.. సులభంగా కరిగిస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కావును బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఉసిరి రసాన్ని ట్రై చేయండి.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
ఉసిరికాయ రసంలో చాలా రకాల మూలకాలుంటాయి. అయితే ఇందులో పోషకాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ రసాన్ని తీసుకోండి.
మధుమేహం నుంచి ఉపశమనం:
ఉసిరిలో విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రింస్తుంది. ముఖ్యంగా మధుమేహం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చర్మంపై ముడుతలు:
నారింజ పండ్ల కన్నా ఉసిరి కాయల్లో 20 శాతం ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. కావును శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా చర్మంపై ముడతల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో ఉన్న మలినాలను శుభ్రం చేసేందుకు సహాయపడుతుంది. కావున క్రమం తప్పకుండా ఉరిసి రసం తీసుకుంటే శరీరానికి చాలా రకాలు మేలు జరుగుతుంది.
Read Also: Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైన కీర్తి.. వరుడు ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook