Ktr Tweet: భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను అసేతు హిమాచలం ఘనంగా జరుపుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. దేశమంతా త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతున్న వేళ గుజరాత్ సర్కార్ తీసుకున్న ఏ నిర్ణయం అందిరిని షాక్ కు గురి చేసింది. పంద్రాగస్తు రోజున 11 మంది రేపిస్టులను రిలీజ్ చేసింది గుజరాత్ సర్కార్. దీనిపై దేశ వ్యాప్తంగా రచ్చ సాగుతోంది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో రేపిస్టుల విడుదల జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. అది కూడా స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా కావడం మరింత అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది.
11 మంది రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేపిస్టుల విడుదలకు గుజరాత్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత ఎర్రకోట నుంచి జాతీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మహిళల గురించి చేసిన కామెంట్లను మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో గుర్తు చేశారు. ప్రధాని మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే.. గుజరాత్ లో రిలీజైన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాలని సూచించారు. వెంటనే గుజరాత్ సర్కార్ ఆదేశాలను రద్దు చేయాలని మోడీని కోరారు కేటీఆర్. రేపిస్టులను విడుదల చేయవద్దని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఉన్నాయని.. అయినా గుజరాత్ సర్కార్ రేపిస్టులను రిలీజ్ చేయడం వికారంగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేపిస్టులకు కఠిన శిక్షను అమలు చేయాలని, ఆ దిశగా ఐపీసీ చట్టాలను సవరించాలని ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించారు మంత్రి కేటీఆర్. రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా వెంటనే చట్ట సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.
Dear PM @narendramodi Ji,
If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏
Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation
— KTR (@KTRTRS) August 17, 2022
2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో పై దారుణంగా వ్యవహరించారు దుండగులు. ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బిల్కిస్ బానో కుటుంబంలో ఏడుగురిని కిరాతకంగా చంపశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలమైంది. ఈ కేసులో 11 మంది నిందితులకు జైలుశిక్ష పడింది. ఈ నిందితులనే పంద్రాగస్టు రోజున రిలీజ్ చేయడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
Read Also: Revanth Reddy: రేవంత్ రెడ్డితో ఉండలేం.. కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత రాజీనామా?
Read Also: Kaleshwaram Project: వైట్ ఎలిఫెంట్ గా మారిన కాళేశ్వరం.. మూడేళ్లలో రూ.3,600 కోట్ల కరెంట్ బిల్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook