Bigg Boss 6 Eliminatation: మరో షాకివ్వబోతున్న బిగ్ బాస్.. రెండో వారంలో ట్విస్ట్

Shani Solomon Abhinaya sree to eliminate from bigg boss 6: ఈ వారం బిగ్ బాస్ లో రెండు ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏకంగా ఇద్దరు ఈసారి హౌస్ నుంచి బయటకు వచ్చేయబోతున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 17, 2022, 03:21 PM IST
Bigg Boss 6 Eliminatation: మరో షాకివ్వబోతున్న బిగ్ బాస్.. రెండో వారంలో ట్విస్ట్

Abhinaya sree to eliminate from Bigg Boss 6 Telugu House: భారతదేశంలో అనేక భాషలలో సందడి చేస్తున్న బిగ్ బాస్ తెలుగులో కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ ఆరో సీజన్ ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రెండో వారం ఆఖరికి చేరుకుంది. మొదటి వారం నామినేషన్ కూడా అయ్యాక ఎలిమినేషన్స్ లేవని చెబుతూ షాక్ ఇచ్చిన బిగ్ బాస్ యాజమాన్యం ఈ వారం మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

మొదటి వారంలో ఇనయా సుల్తానా, అభినయ శ్రీ, జబర్దస్త్ ఫైమా, శ్రీ సత్య, ఆరోహి, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఏడుగురు నామినేషన్స్‌లో ఉండగా అభినయ శ్రీ ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ ఎలిమినేషన్ ప్రక్రియ నిలిపివేసి ఆమెను సేవ్ చేశారు. ఇక రెండో వారంలో ఆది రెడ్డి, రోహిత్- మెరీనా, షానీ సాల్మన్, రాజశేఖర్, రేవంత్, అభినయ శ్రీ, ఫైమా, గలాటా గీతూ మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో మిగతా అందరికీ మంచి ఓటింగ్ శాతం లభించగా షానీ సాల్మన్, అభినయశ్రీ ఇద్దరికీ మంచి ఓటింగ్ లభించలేదని తెలుస్తోం.

Shani Solomon to eliminate from Bigg Boss 6 Telugu House:  ఈ ఇద్దరికీ చాలా తక్కువ ఓట్లు లభించడంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షోలో నుంచి షానీ సాల్మన్ ఎలిమినేట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మరో ప్రచారాన్ని కూడా తెర మీదకు తీసుకువచ్చారు సోషల్ మీడియా నెటిజన్లు.

అదేమిటంటే ఈ వారం 2 ఎలిమినేషన్స్ జరగబోతున్నాయని, షానీ సాల్మన్ తో పాటు అభినయశ్రీ కూడా ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నాగార్జున శని ఆదివారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ షూటింగ్ శనివారం ఉదయం నుంచి ప్రారంభిస్తారు కాబట్టి ఇప్పటికే ఈ సమాచారం లీక్ అయిందని దాదాపుగా ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. 

Also Read: Unstoppable With NBK Season 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ కి అంతా రెడీ... అప్పటి నుంచే స్ట్రీమింగ్!

Also Read: Nora Fatehi Beaten Up: చెప్పు దెబ్బలు తిన్న బాహుబలి భామ.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News